Vishakha Singh: హాస్పిటల్ బెడ్ పై దారుణమైన స్థితిలో ప్రముఖ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు.
మరి కొందరు అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు.ఒకరి తర్వాత ఒకరు సెలబ్రెటీలు ఇలా అరుదైన వ్యాధి బారిన పడుతుండడంతో అభిమానులు కలవర పడుతున్నారు.
తాజాగా కూడా మరో నటి హాస్పిటల్ బెడ్ పై కనిపించి షాక్ ఇచ్చింది.
హీరోయిన్( Heroine ) ఎవరు అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హీరోయిన్ విశాఖ సింగ్.( Vishakha Singh ) తమిళ హీరోయిన్ విశాఖ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
నిత్యం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే వారికి ఈమె బాగా సుపరిచితమే.మొదట తెలుగు సినిమాతోనే తన కెరీర్ ను మొదలుపెట్టినప్పటికీ ఊహించని విధంగా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది.
మొదట 2007లో విడుదలైన జ్ఞాపకం సుకుమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.తరువాత పిడిచ్చిరుక్కు అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కూడా ఆశించిన విధంగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాకుండా కన్నడ హిందీ మలయాళం లో కూడా నటించి మెప్పించింది.
కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొహ్రరం అనే షార్ట్ ఫిల్మ్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు. """/" /
అక్తం చక్తం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె ఎటువంటి అవకాశాలు లేక ఇంట్లోనే ఉంటోంది.
సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది.
అందులో విశాఖ సింగ్ హాస్పిటల్ బెడ్ పై( Vishakha Singh Hospitalized ) ఉంది.
అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటాను.
"""/" /
కొన్ని భయంకరమైన సంఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో వస్తున్న ఆరోగ్య సమస్యలు తరచుగా వేధిస్తున్నాయి.
కానీ ఒక సంతోషకరమైన ఎండాకాలం కోసం ఎదురు చూస్తున్నాను.ఏప్రిల్ నెల ప్రతీసారి నాకు ఒక కొత్త సంవత్సరం లా అనిపిస్తుంది.
ఎందుకంటే అదే కొత్త ఆర్థిక సంవత్సరం కాబట్టి.లేదంటే అది నేను పుట్టిన సంవత్సరం అవటం వల్ల కావచ్చు.
ఎండాకాలపు రోజల కోసం ఆరోగ్యపు దృఢ సంకల్పాల కోసం ముందుకు సాగుతున్నాను అని రాసుకొచ్చింది విశాఖ సింగ్.
ఆ ఫోటోపై స్పందించిన నెటిజన్స్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!