కళ్యాణ్ రామ్ గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

విజయ్ శాంతి కళ్యాణ్ రామ్ కలిసి నటించిన లేటెస్ట్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి.

( Arjun Son Of Vyjayanthi ) ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మీడియాతో మీడియాతో ముచ్చటించారు విజయశాంతి.

( Vijayashanti ) ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.ఈ మధ్య నేను చేసిన ఒక సినిమా విషయంలో ప్రేక్షకులు అంతగా తృప్తి చెందలేదు.

నా నుంచి ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు. """/" / ఇలాంటి సమయంలో ఒక యాక్షన్‌ ప్రధానమైన పాత్ర చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కలిగింది.

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చేయడానికి ప్రధాన కారణం కూడా అదే.ఒక మంచి సినిమా చేశాననే తృప్తి కలిగింది అని అన్నారు విజయశాంతి.

నేనేం చేశానో.నా సినిమాల వైభవం ఏమిటో నిన్నటితరం ప్రేక్షకులకు బాగా తెలుసు.

అలా కొత్త తరం ప్రేక్షకులకు తెలిసేలా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఈ కథలో తల్లి, తనయుల మధ్య బంధం, భావోద్వేగాలతోపాటు యాక్షన్‌ నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది.

ఇప్పుడు యాక్షన్‌ అనేది నాకు ఒక సవాల్‌.కానీ నేను స్వీకరించాను.

"""/" / నేను చేసిన యాక్షన్‌ సన్నివేశాల్ని అందరూ మెచ్చుకుంటున్నారు.రాములమ్మని ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నామో, అలాంటి పాత్ర చేసిందంటున్నారు.

కల్యాణ్‌ రామ్‌( Kalyan Ram ) కూడా అద్భుతంగా నటించారు.తల్లి, తనయుల మధ్య భావోద్వేగాల గురించి చెబుతుంటే ఆనందంగా ఉంది.

కల్యాణ్‌ రామ్, నాకూ మధ్య తెరవెనక కూడా అంతే అనుబంధం ఉంది.తనకి నాపై ఉన్న ఆప్యాయత చూస్తే, గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.

ఈ సినిమాకి అలా అన్నీ అద్భుతంగా కుదిరాయి.పరీక్షల కారణంగా కొంతమంది ఇంకా సినిమా చూడలేదని తెలిసింది.

రేపటి నుంచి సినిమాకి ఇంకా ఆదరణ పెరుగుతుంది అని తెలిపారు.