తల్లి పాత్రలో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఏ సినిమా అంటే?

క్రాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ సినిమాలో ఈమె జయమ్మ పాత్రలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈమె శబరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ద్వారా అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇక ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలలో విడుదల కానుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సమావేశంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కొడైకెనాల్ లో పూర్తి చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఈమె తెలియజేస్తూ గత రెండు వారాలుగా కొడైకెనాల్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో ముగిసింది.

ఈ షెడ్యూల్ చిత్రీకరణ చాలా త్వరగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. """/" / ఈ సినిమాని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

ఇక ఈ సినిమా గురించి డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ ఇందులో ఒక కూతురిని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించే ఒక తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారని ఈయన తెలియజేశారు.

ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈయన ఆశ భావం వ్యక్తం చేశారు.

ఇక నిర్మాత మహేంద్ర నాథ్ మాట్లాడుతూ ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా తర్వాత షెడ్యూల్ వైజాగ్లో చిత్రీకరణ జరుపుకుంటుంది అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ.. నెటిజన్ల విమర్శలపై కీర్తిభట్ రియాక్షన్ ఇదే!