నా భర్త చెప్పిన వినకుండా రాత్రికి రాత్రి 2 కోట్లు పోగొట్టాడు : నటి తులసి

నటి తులసి .( Actress Tulasi ) ఈమె పేరు చెబితే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా గుర్తుపడతారు.

శంకరాభరణం చిత్రం( Sankarabharanam Movie ) నుంచి నిన్న మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చేయని పాత్రలు లేవు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కెరియర్ నీ కొనసాగిస్తుంది తులసి.

తులసి కేవలం నటిగా మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలను తీసింది.

తన 28 ఏళ్ల వయసులో కన్నడ డైరెక్టర్ అయిన శివమణి( Shivamani ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరికి సాయి అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు.అయితే తులసి శివమణి ఇద్దరు కూడా నటి నటులుగా కొనసాగుతూనే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా కూడా మారారు.

"""/" / అయితే రాత్రికి రాత్రే రెండు కోట్ల రూపాయలను పోగొట్టేసారట తులసి భర్త శివమణి.

అతడికి తానే హీరోగా, డైరెక్టర్ గా ఒక సినిమా తీయాలనే కోరిక ఉండేది.

అప్పటి వరకు ఉ సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) బాగానే డబ్బులు సంపాదించారు.

దాంతో తానే సొంతంగా రెండు కోట్లు పెట్టి ఒక సినిమా తీయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

అలా వద్దు అని చెప్పినా కూడా వినకుండా తులసి భర్త శివమని సినిమా తీసి రెండు కోట్ల రూపాయలను పోగొట్టారట.

అప్పటి నుంచి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట తులసి. """/" / తాను కూడా సొంతంగా డబ్బులు బాగానే సంపాదిస్తానని, ఇప్పటి వరకు డబ్బు విషయంలో ఎలాంటి లోటు లేదు అని, తెలుగులో సౌత్ ఇండియాలో అందరూ పిలిచి క్యారెక్టర్స్ బాగానే ఇస్తున్నారని, కానీ ఇచ్చిన దాన్ని కాపాడుకోవడంలోనే నేను విఫలం అయ్యానని, ఇకపై అలాంటి తప్పు జరగబోదు అంటూ కూడా తులసి చెబుతున్నారు.

తనకు ఇప్పటి వరకు దేవుడు దయవల్ల తిండికి, బట్టకు ఎక్కడా లోటు లేకుండా బాగానే సాగిపోతుంది అంటూ చెబుతున్నారు.

ఇక నా భర్త చేసే అప్పులు నాకు ఎలాంటి సంబంధం లేదు అని, అయన ఎంత వద్దు చెప్పినా వినకుండా చేసే పనికి నేను బాధ్యత వహించను అంటూ కూడా చెబుతున్నారు.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??