అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష..?

కరోనా, లాక్ డౌన్ రూల్స్ వల్ల సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో సెలబ్రిటీల పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం త్రిష ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరిగింది.

అయితే ఆ ప్రచారంపై త్రిష అస్సలు స్పందించలేదు.తాజాగా త్రిష చేసిన కామెంట్లను పరిశీలిస్తే త్వరలోనే త్రిష పెళ్లి పీటలెక్కబోతుందని అర్థమవుతోంది.

తాజాగా తనకు కాబోయే వ్యక్తి గురించి త్రిష స్పందిస్తూ తనకు అందంగా ఉన్న వ్యక్తి అవసరం లేదని బాగా చూసుకుంటే చాలు అని చెప్పుకొచ్చారు.

తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోనని ఆమె వెల్లడించారు.తనకు అన్ని రంగులలో నలుపు రంగు అంటే ఇష్టమని తనకు కాబోయే వ్యక్తి హీరోలా ఉండాలని తాను కోరుకోవడం లేదని త్రిష చెప్పుకొచ్చారు.

కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని ఆమె వెల్లడించారు.

"""/"/ త్రిష పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తోటి హీరోయిన్లంతా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాళ్లవుతున్నారు.

దీంతో త్రిష కూడా పెళ్లిపై తెగ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.కొన్ని నెలల క్రితం త్రిష కోలీవుడ్ హీరో శింబును పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.

త్రిష వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆమె సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

త్రిష పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.త్రిష ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గడంతో పెళ్లిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అయితే త్రిష ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తల పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంగారక గ్రహానికి అద్భుతమైన కాపీ క్రియేట్ చేసిన యూకే.. ఎందుకంటే..?