తాప్సీని చెత్త హీరోయిన్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ.

తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ప్రభాస్ కు జోడిగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తాప్సీకి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తరువాత తాప్సీ నటించిన దరువు, గుండెల్లో గోదారి, సాహసం సినిమాలు హీరోయిన్ గా తాప్సీ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

అయితే స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ సినిమాల్లో తాప్సీ ఎక్కువగా నటిస్తోంది.

గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్న తాప్సీ తాజాగా ఒక నెటిజన్ కామెంట్ కు ఘాటుగా జవాబిచ్చి వార్తల్లోకెక్కింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ తాజాగా అథ్లెట్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

"""/"/ ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే సినిమాలో నటిస్తోన్న తాప్సీ ఈ సినిమా కోసం మైదానంలో శ్రమిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తాప్సీని దారుణంగా విమర్శించారు.

ఒక నెటిజన్ తాప్సీ గ్లామర్ షో వల్ల హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటోందని ఆమెకు నటన రాదని పేర్కొన్నారు.

తాప్సీలో స్పెషాలిటీ ఏమీ లేదని ఫాల్తూ హీరోయిన్ అని ఆ నెటిజన్ కామెంట్ చేశారు.

హిట్టయ్యే సినిమాలను ఎంచుకుని మరీ తాప్సీ సినిమాలను చేస్తోందని అందువల్లే హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

నెటిజన్ కామెంట్ గురించి నటి తాప్సీ ఘాటుగా స్పందించారు.తాను సినిమాల్లో తన ప్రతిభను మాత్రమే చూపించానని ఆ ప్రతిభను నువ్వు చూడలేకపోయావని నెటిజన్ కు కౌంటర్ ఇచ్చారు.

తాను ఎంచుకుని సినిమాలు చేయడం లేదని ఇమేజ్ ను పెంచుకునే సినిమాలను చేస్తున్నానని పేర్కొన్నారు.

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ పడి ఫ్లైట్ డోర్ ఊడబీకేసిన వ్యక్తి.. తర్వాతేమైందో తెలిస్తే..?