Tamannaah : తమన్నా కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamannaah ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.అందుకే అభిమానులు ఈమెను మిల్కీ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఇకపోతే తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే రేంజ్ లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్( Web Series ) లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది తమన్నా.

స్టార్ హీరోయిన్ లకు మాత్రమే కాకుండా హీరోయిన్లకు కూడా పోటీగా నిలుస్తోంది. """/" / ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటిస్తున్న భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా నటిస్తోంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమన్నా కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా నటించిన కొత్త సిరీస్ జీ కర్దా స్ట్రీమింగ్( Zee Karda Streaming ) కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మూవీ మేకర్స్.

"""/" / ఈ మేరకు వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్.స్నేహం ప్రధాన ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఏడుగురి మిత్రుల ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథే జీ కర్దా.

దీనికి డైరెక్టర్ అరుణిమ శర్మ( Arunima Sharma ) దర్శకత్వం వహించారు.ఈ సిరీస్ లో ఆషిమ్, సుహైల్ నాయర్, అన్యా సింగ్, హుస్సేన్ తదితరులు నటించారు.

కాగా ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటికే 11th అవర్‌, నవంబర్‌ స్టోరీ లాంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.