ఎవ్వరితో ఆ మాట అనిపించుకోకూడదు అంటున్న మిల్కీ బ్యూటీ !

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.

మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు పోతుంది.

ఇటీవలే తమన్నా మాల్దీవులకు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి హొయలు పోతూ కనిపించింది.

ఈమె బికినీ వేసుకుని మరీ మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసింది.ఈమె అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

తమన్నా ఇటీవల గుర్తుందా శీతాకాలం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్నా ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలను చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే ఈమె కెరీర్ లో ఈమె ఎంచుకునే పాత్రల గురించి కూడా తెలిపింది.

"""/"/ ''నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ఇన్నేళ్లు అయ్యిందా అనిపిస్తుంది.అప్పుడే సీనియారిటీ వచ్చింది.

కానీ సీనియారిటీ వచ్చిన తర్వాత ఎలాంటి పాత్రలు చేయాలి అన్నా జాగ్రత్తగా అలోచించి చేయాలి.

లేకపోతే తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని అంటారు.నా స్థాయిని నేనే తగ్గించుకోలేను కదా.

నేను నా కెరీర్ మొదలయ్యి ఇన్నేళ్లు అయినా నేను చేయాలనుకున్న పాత్రలను చాలా చేయనేలేదు.

అలాంటి పాత్రలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నన్ను నేను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సమయం కోసం ఎదురు చూస్తున్నా అంటూ తెలిపింది.

చనిపోయిన కోళ్ల నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..