నా లైఫ్ లో చెత్తరోజు.. సురేఖ వాణి కూతురు ఎమోషనల్..?
TeluguStop.com
సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, వదిన తరహా పాత్రల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి సినిమా ఆఫర్లు తగ్గినా కూతురుతో కలిసి వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
త్వరలో సురేఖ వాణి కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారని తెలుస్తోంది.
అయితే సురేఖ వాణి భర్త సురేశ్ తేజ రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు మృతి చెందారు.
తండ్రి మృతి చెంది రెండేళ్లు కావడం సుప్రీత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తన లైఫ్ లో మే 6వ తేదీ చెత్తరోజు అని సుప్రీత అన్నారు.
కొన్నిసార్లు మనం వాళ్ల మాటలను వినలేమని వాళ్ల నుంచి ఫోన్ కాల్స్ కూడా రావని దానినే మనం లవ్ అంటామని సుప్రీత పేర్కొన్నారు.
నాన్నను తాను చాలా మిస్ అవుతున్నానని సుప్రీత అన్నారు.తన తండ్రి ఇప్పటికీ తన చుట్టూనే ఉన్నాడని భావిస్తున్నానని సుప్రీత పేర్కొన్నారు.
"""/"/
తనను తండ్రి వదిలి రెండు సంవత్సరాలు అయిందంటే తాను అస్సలు నమ్మలేకపోతున్నానని సుప్రీత పేర్కొన్నారు.
నాన్నను ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటానని మిస్ యూ నాన్న అంటూ సుప్రీత ఎమోషనల్ పోస్ట్ పెట్టడం గమనార్హం.
సుప్రీత పోస్ట్ ను చూసిన నెటిజన్లు సుప్రీతకు స్ట్రాంగ్ గా ఉండమని సూచనలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత ఎమోషనల్ కావడంతో పాటు తన లైఫ్ లో కూడా ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయని తెలిసేలా చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో సుప్రీతకు ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.రెండు సంవత్సరాల క్రితం బ్లడ్ క్లాట్ కావడం వల్ల సురేష్ తేజ మృతి చెందారు.
అలా తోడుండే భాగస్వామి కావాలి.. హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!