దర్శన్ ఎప్పటికీ నా కొడుకులాంటి వాడే.. సుమలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

దర్శన్ ఎప్పటికీ నా కొడుకులాంటి వాడే సుమలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

రేణుక స్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

దర్శన్ ఎప్పటికీ నా కొడుకులాంటి వాడే సుమలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

రేణుక స్వామి(Renuka Swamy) హత్య కేసుల్లో ప్రధాన నిందితుల్లో దర్శన్(Darshan) కూడా ఒకరు.

దర్శన్ ఎప్పటికీ నా కొడుకులాంటి వాడే సుమలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

గత కొద్ది నెలలుగా జైల్లోనే ఉంటున్న దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే దర్శన్ కు బెయిల్ మంజూరు కావడంపై తాజాగా నటి సుమలత అంబరీష్(sumalatha Ambareesh) స్పందించారు.

ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా సుమలత స్పందిస్తూ.నటుడు దర్శన్ కు నాకు ఎప్పటికీ కొడుకుతో సమానం.

అతను ఏం చేసినా ఆ ఫీలింగ్ మారదు.దర్శన్‌(Darshan) కు నేను ఎప్పుడూ అండగా ఉంటాను.

ప్రస్తుతం అతను వెన్ను నొప్పికి చికిత్స పొందుతున్నాడు.దర్శన్ కు నడుము నొప్పి ఎక్కువగా ఉంది.

అయితే సర్జరీ అంటే ఇష్టం లేదని విన్నాను.ఎందుకంటే సర్జరీ చేస్తే రికవరీ టైమ్ ఎక్కువగా ఉంటుంది.

ఇక అతని సినిమాల షూటింగ్ సగంలోనే ఉన్నాయి.దీంతో సినీ పరిశ్రమ నష్టాలను చవిచూస్తున్న పరిస్థితి.

దర్శన్ కు మేం నైతిక మద్దతు ఇస్తున్నాము.అతను బాగుంటాడని ఆశిస్తున్నము.

"""/" / నేను దర్శన్ భార్య విజయలక్ష్మితో (Darshan's Wife Vijayalakshmi)టచ్‌ లో ఉన్నాను.

అతనికి విశ్రాంతి అవసరం.ముందుగా అతనిని కోలుకోనివ్వండి.

న్యాయపరమైన సవాళ్లన ఎదుర్కొని బయటకు రావాలని మేం కోరుకుంటున్నాము.మా సంబంధం అలాగే ఉంటుంది.

నేను బతికున్నంత కాలం దర్శన్ నా కొడుకు.నిజం బయటకు రావాలి.

అతనికి అంతా మంచే జరగాలి.నిర్దోషి గా నిరూపించుకుని బయటకు రావాలన్నదే నా కోరిక.

అని సుమలతా అంబరీష్ చెప్పుకొచ్చారు.అయితే ఈ సందర్భంగా సుమలత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

కొందరు సుమలత పై మండిపడుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ సినిమా మీద పెరుగుతున్న క్రేజ్…