ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుందామనుకున్న నటి సుధా.. కానీ అలా జరగడంతో?

సినిమా ఇండస్ట్రీలో ఉదయ్కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ గురించి నటి సుధ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నిజానికి ఉదయ్‌కిరణ్ తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రికి దూరమయ్యాడు.

మ్యారేజ్ లైఫ్ కూడా అంతగా ఏం బాలేదు.ఇవన్నీ తనకు ఒక ఒంటరితనం అన్న ఫీలింగ్‌ను తీసుకొచ్చాయని నటి సుధ తెలిపారు.

దాదాపు తాను కూడా అదే విధంగా తన అమ్మను పోగొట్టుకోవడం, కొన్నింటికి దూరం కావడం, ఇవన్నీ ఎందుకు అని ఆమె అన్నారు.

ఒక నడి సముద్రంలో ఉన్నపుడు ఏదైనా దొరికిందంటే బయటికి వచ్చేదామన్న ఫీలింగ్ ఉంటుంది కదా .

? ఆ తపనతోనైనా ఎందుకో ఉదయ్‌ కిరణ్‌ను చూస్తే దేవుడు తనకు ఇచ్చిన బిడ్డేనేమో అని అనిపిస్తుందని ఆమె తెలిపారు.

ఒకవేళ ఇవాళ అతను ఉండి ఉంటే సినిమాలు చేస్తాడా, చేయడా, హీరోనా ,కాదా ? అవన్నీ పక్కన పెట్టేసేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు.

వాడు తన కొడుకు అన్న భావన మాత్రం తాను ఉన్నంత వరకు ఉంటుంది కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే మా ఇద్దరి మెంటాలిటీ వేవ్‌లెంత్ ఒకేలా ఉండేదని సుధ అన్నారు.దాదాపుగా తాను ఏమనుకుంటుందో, ఉదయ్‌ కిరణ్‌ ఆలోచనలు కూడా ఇద్దరివీ ఒకే విధంగా ఉండేవని ఆమె అన్నారు.

సాఫ్ట్‌గా కానీ, మాటల తీరు గానీ తామిద్దరీ ఒకేలా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక దత్తత విషయానికొస్తే , పేపర్లు సబ్‌మిట్ చేశాం, అఫిడవిడ్ కూడా ఇచ్చాము.

లాయర్ ద్వారా వెళ్లింది.ఒక 3 లేదా 4 నెలలు మాత్రమే ఉంటుంది.

కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అంటే తాము ఇక తీసుకోవచ్చు.అప్పటికీ 45 ఏళ్ల తర్వాత తీసుకోవచ్చని రూల్ ప్రకారం అలా ఉందని తాను కోరినట్టు సుధ తెలిపారు.

ఈ లోపు ఫోన్ కట్ చేశాడు.మాటలు తగ్గిపోయాయి.

సరే తన ఫోన్ ఎత్తడు అనుకో.తన కూతురు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదని, తన దగ్గర పనిచేసే అతనితో క్లోజ్‌గా ఉంటాడని, అతను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, కలుద్దామని వెళ్లినా కలవలేదని ఆమె చెప్పుకొచ్చారు.

టోటల్‌గా కట్‌ ఆఫ్ చేసుకుంటూ వచ్చాడని ఆమె తెలిపారు.అప్పుడు తనకు తెలియలేదని ఆమె అన్నారు.

"""/"/ ఇక పెళ్లికి ఇన్విటేషన్ పంపించినా కూడా తాను వెళ్లలేదని, ఎందుకంటే వద్దు అనుకున్నానని, అందుకు బాధేసిందని ఆమె అన్నారు.

ముందే తనకు ఆ అమ్మాయి సెట్ కాదేమో అని అనిపించినట్టు ఆమె తెలిపారు.

ఆ టైంలో కొంచెం బిజీగా ఉండి కూడా తాను వెళ్లలేకపోయానని ఆమె వివరించారు.

అదంతా తప్పు అని ఇప్పుడు తాను ఫీల్ అవుతున్నట్టు సుధ ఆవేదన వ్యక్తం చేశారు.

వాడు ఉండి ఉంటే ఇంకొంచెం తనకు బలంగా ఉండేదని ఆమె అన్నారు.కానీ ఎందుకు ఉదయ్ కిరణ్ చావాలి అని అనుకొని ఉంటే, ఆ ఎందుకు ముందుకొచ్చి, వాడి చావు వెనక్కి వెళ్లిపోయేదని ఆమె తెలిపారు.

ఆ తర్వాత వాడు పోవాలి అని ఉంటే ఎలాగైనా పోతాడు అది వేరే అని ఆమె అన్నారు.

/br """/"/ ఒకరోజు షూటింగ్లో చలపతిరావు ముందు ఏడ్చాడని, అంతకు ముందు తనను కలవడానికి తన దగ్గర పనిచేసే హెయిర్ డ్రెస్సర్‌ తో అమ్మను కలవాలి అని ఏడుపు దిగమింగుకొని అడిగానని ఉదయ్ చెప్పినట్టు ఆమె తెలిపారు.

రావడం రావడంకోనే తన కాళ్లు పట్టుకొని ఏడ్చిన ఏడుపు తనకు ఇంకా గుర్తింది అంటూ ఆమె ఉద్వేగభరితం చెందారు.

ఎప్పుడో, ఏదో జన్మలో మిగిలిపోయిన బంధం ఉండి ఉంటుంది ఇలా తీర్చేసి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన చెందారు.

ఆ తర్వాత దేనితోనూ అంత అటాచ్‌మెంట్ పెట్టుకోలేదని ఆమె వివరించారు.

లోక్‎సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త వ్యూహాం..!