Actress Sudha: ఎదురింట్లో ఉండే అబ్బయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను : నటి సుధ
TeluguStop.com
సుధ.( Actress Sudha ) క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తమిళ్ మలయాళ ఇండస్ట్రీలో 500కు పైగా సినిమాల్లో నటించింది నటి సుధ.
అందరిలాగానే హీరోయిన్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ కొన్ని చిత్రాల్లో నటించగానే సినిమా ఇండస్ట్రీకి తాను హీరోయిన్ గా పనికి రాను అని అర్థం చేసుకుని మార్చుకుంది.
తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగిన సుధా మద్రాస్ లోనే ఎక్కువ కాలం ఉంది సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి తరలి వచ్చాక ఆమె కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది.
సినిమా ఇండస్ట్రీలో అందరూ రాగానే ఆమె కూడా ప్రేమ వివాహం( Love Marriage ) చేసుకోండి తన ఎదురింట్లో ఉండే వ్యక్తిని ప్రేమించగా మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పించి వివాహం చేసుకుంది.
"""/" /
సుధా పెళ్లి చేసుకున్న వ్యక్తికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా ఆమె తన కెరీర్ ను కొనసాగించడానికి ఇంట్లో వారు ఎవరు అభ్యంతరం చెప్పలేదు.
పైగా ఆమె నటించేవి అన్నీ కూడా సాఫ్ట్ క్యారెక్టర్స్ కావడంతో అందరికీ సినిమాలు బాగా నచ్చేవి కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వందల సినిమాల్లో నటించి బాగానే సెటిల్ అయింది.
ఇక సుధకు ఇద్దరు పిల్లలు.ఒక కొడుకు, ఒక కుమార్తె.
కానీ కొడుకు ప్రేమ వివాహం చేసుకొని తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి విదేశాల్లో సెటిల్ అయ్యాడు.
అతనితో ప్రస్తుతం ఆమె అన్ని రకాలుగా సంబంధాలు తెంచుకుంది ఇక కుమార్తె డిసిబి బ్యాంకులో పని చేస్తుంది.
"""/" /
నీకు ఎంతమంది పిల్లలు అంటే కేవలం ఒక్క కుమార్తె అని మాత్రమే చెబుతుంది ఇక కొడుకుతో సుధా భర్త( Sudha Husband ) మాత్రం బాగానే సంబంధాలను కలిగి ఉన్నాడు.
ఇక్కడ హైదరాబాదులో వదిలేసి ఆయన కూడా తన కొడుకుతో విదేశాల్లోనే ఉండడం విశేషం.
కేవలం కుమార్తెతోనే సుధా ప్రస్తుతం హైదరాబాదులో ఉంటుంది.ఇంకా తనకు ఆమె తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పడం పట్ల సుధకు తన కొడుకు పై ఉన్న ద్వేషం కనిపిస్తుంది.
ఇక ఆమె ఉదయ్ కిరణ్ బ్రతికున్న టైంలో అతని దత్తత తీసుకోవాలన్న విషయాన్ని కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే.
జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!