నా తండ్రితో నాకు పెళ్లి చేస్తారా.. శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు వైరల్!

స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి వార్తలు కొత్తేం కాదు.ఈ మధ్య కాలంలో శ్రీముఖి కచ్చితంగా పెళ్లి చేసుకోనున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రముఖ వ్యాపారవేత్తను శ్రీముఖి పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపించాయి.కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో శ్రీముఖి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనంటూ ఫోటోలు సైతం ప్రచారంలోకి వచ్చాయి.

ఆ ప్రచారం గురించి గురించి శ్రీముఖి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్న వ్యక్తి తన తండ్రి అని నా తండ్రితో నాకు పెళ్లి చేస్తారా? అంటూ శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన గురించి, తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి అతనితో నా పెళ్లి జరగనుందని ప్రచారం చేస్తున్నారని ఇదెంత ఘోరం అని శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

నా పెళ్లి గురించి వైరల్ అవుతున్న రూమర్లను విని అలసిపోయానని ఆమె అన్నారు.

నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు అంటూ శ్రీముఖి విమర్శలు చేశారు.

శ్రీముఖి రియాక్షన్ తర్వాతైనా ఆమె పెళ్లి గురించి ప్రచారం చేసేవాళ్లు ఆగుతారేమో చూడాల్సి ఉంది.

శ్రీముఖి ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీ అవుతున్నారు.శ్రీముఖి యాంకర్ గా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

"""/"/ శ్రీముఖి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర యాంకర్ల స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే శ్రీముఖి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు భావిస్తున్నారు.

శ్రీముఖి టీవీ షోలతో మరింత బిజీ కావాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కల్కి మూవీలో కృష్ణుడి రోల్ ను చరణ్, ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారా.. అసలు నిజాలివే!