బాయ్ ఫ్రెండ్ తో కలిసి కుటుంబ వేడుకల్లో పాల్గొన్న శ్రీ లీల… వీడియో వైరల్!

సినీనటి శ్రీ లీల(sree Leela) ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక ఇటీవల ఈమె పుష్ప 2(Pushpa 2) సినిమాలో కిస్సిక్ పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా శ్రీ లీలా ఎంతో బిజీ అవుతున్నారు.

"""/" / ఇదిలా ఉండగా ఈమె గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోతో (Bollywood Hero)కలిసి చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించారు.

అదేవిధంగా ఇటీవల ఓ వెకేషన్ కి కూడా ఈమె అజ్ఞాత వ్యక్తితో కలిసి వెళ్లారు కానీ అతని ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.

ఇలా తరచూ బాయ్ ఫ్రెండ్ తో (boyfriend) కలిసి ఈమె వెకేషన్లు పార్టీలు అంటూ తిరుగుతున్న నేపథ్యంలో శ్రీ లీల రిలేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈమె ఓ కుటుంబ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుత మందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/" / ప్రముఖ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)చెల్లెలు డాక్టర్ కృతికా తివారి సాధించిన వైద్య విభాగంలో మరో ఘనతను సెలబ్రేట్ చేసుకుంటూ కార్తీక్ ఆర్యన్ కుటుంబం ఒక పార్టీని నిర్వహించారు.

ఇక ఈ పార్టీలో శ్రీ లీల సందడి చేయడం విశేషం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఆమె ఇతర అతిథులతో కలిసి ఆనందంగా డాన్స్ చేస్తూ కనిపించింది.

కార్తీక్ తన ఫోన్‌తో ఈ సందర్భాన్ని వీడియో తీస్తుండగా, ఆమె ఆనందంగా డాన్సులు వేస్తూ కనిపించారు.

ఈ క్రమంలోనే శ్రీ లీల కార్తీక్ ఆర్యన్ కుటుంబ సభ్యులతో ఇంత చనువుగా మూవ్ అవుతున్న నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ గురించి నేటిజన్స్ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం వీరిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.