‘గుంటూరు కారం’ సినిమా పేరు ఎత్తితే మండిపడుతున్న శ్రీలీల..అంత కోపం ఎందుకో!

చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీ గా ఉన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఎవరు అంటే, మన అందరికీ గుర్తుకువచ్చే పేరు శ్రీలీల( Sreeleela ).

పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె కుర్ర హీరోయిన్ కేవలం రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఈమె ఎంట్రీ తో అప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న హీరోయిన్ల అడ్రస్ గల్లంతు అయ్యింది.

చిన్న హీరోల దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికి ఇప్పుడు శ్రీలీల డేట్స్ కావాలి.

రీసెంట్ గానే 'స్కంద'( Skanda ) చిత్రం తో మన ముందుకు వచ్చిన శ్రీలీల, ఈ నెల 20 వ తారీఖున నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన భగవంత్ కేసరి చిత్రం తో మన ముందుకు రాబోతుంది.

"""/"/ ఈ సినిమా ప్రొమోషన్స్( Bhagavanth Kesari Movie Promotions ) లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీలీల పై యాంకర్స్ దిష్టి పెట్టేస్తున్నారు.

అసలు ఇన్ని సినిమాలను చేతిలో పెట్టుకొని ఎలా మ్యానేజ్ చేస్తున్నావు.నువ్వు ఒక్క రోజు సెలవు పెడితే ఇండస్ట్రీ మొత్తం స్ట్రైక్ అయిపోతుంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు.

దీనికి శ్రీలీల సమాధానం ఇస్తూ, ఇన్ని సినిమాలు చెయ్యడం అంటే మీకు కామెడీ గా ఉందా?, ఎంత కష్టపడాలో తెలుసా ?, అన్నీ సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేస్తూ, మళ్ళీ డబ్బింగ్ వర్క్స్ కూడా చెయ్యాలి.

ఇక సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయం లో ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనాలి.

ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతాది తెలుసా మీకు అంటూ శ్రీలీల చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి.

అంతే కాకుండా శ్రీలీల భవిష్యత్తులో చెయ్యబోతున్న సినిమాల గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

"""/"/ ఎక్కువగా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న 'గుంటూరు కారం'( Guntur Karam ) చిత్రం గురించి అడిగారు.

దీనికి శ్రీలీల చాలా విన్నూతన రీతిలో సమాధానం ఇచ్చింది.ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా?, ఇప్పుడు నేను 'భగవంత్ కేసరి' మూవీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కేవలం ఆ సినిమా గురించే అడగండి, గుంటూరు కారం చిత్రం గురించి తర్వాత మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

పని ఒత్తిడి కారణంగానే శ్రీలీల అలాంటి సమాధానం ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ఈ చిత్రం తో పాటుగా ఆమె పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ) చిత్రం చేస్తుంది.

ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయబోతుంది.

నితిన్ విక్రమ్ కే కుమార్ కాంబో లో వస్తున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?