Sowmya Janu : అమ్మకు ఆరోగ్యం బాలేదు.. అందుకే రాంగ్ రూట్ లో వెళ్లా.. హోం గార్డ్ వివాదంపై సౌమ్య క్లారిటీ ఇదే!
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సౌమ్య జాను( Sowmya Janu ) పేరు కూడా ఒకటి.
తాజాగా ఇమేజ్ రాంగ్ రూట్లో వెళ్లడంతో పాటు పోలీసులతో వాదించి వారి జాకెట్లను చింపేసిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బంజారాహిల్స్ లో( Banjara Hills ) జాగ్వార్ కారులో రాంగ్ రూటులో రయ్ మంటూ దూసుకెళ్లిన ఈ హీరోయిన్, అడ్డొచ్చిన హోంగార్డ్ యూనిఫాం చించేసింది.
జరిగిన ఘటనపై ఆల్రెడీ కేసు నమోదైంది. """/" /
డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుంటే పెద్ద కేసు అవుతుందనే విషయం తెలిసిందే.
పైగా సౌమ్య జాను చేసిన పనిని, అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు, అది కాస్తా వైరల్ అయింది.
అలా వీడియో సాక్షిగా దొరికిన సౌమ్య, తను చేసిన పనిపై వివరణ ఇచ్చింది.
తన అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, అర్జెంట్ గా మందులు తీసుకొచ్చేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో( Wrong Route ) వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇదే విషయాన్ని హోంగార్డ్ కు( Home Guard ) చెప్పినప్పటికీ, అతడు వినిపించుకోలేదని, పైగా బూతులు తిట్టాడని, అందుకే తను కూడా బూతులు తిట్టానని చెప్పుకొచ్చింది సౌమ్య.
"""/" /
హోంగార్డ్ ఓవర్ గా రియాక్ట్ అవ్వడం వల్లనే తను కూడా ప్రతి స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది సౌమ్య.
తాగి బండి నడిపాననే వాదనను ఖండించింది సౌమ్య.తను మందు కొట్టనని, కావాలంటే తను పరీక్షలకు సిద్ధమని తెలిపింది.
జరిగిన ఘటనను వీడియో తీశారనే విషయం తనకు తెలియదని, పొద్దున్న లేచిన తర్వాత వీడియో చూసి ఆశ్చర్యపోయానని అని చెప్పుకొచ్చింది సౌమ్య.
అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు, తప్పు చేసి తప్పించుకోవడానికి మరొక అబద్ధం చెబుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?