Soumya Seth : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో మేనకోడలు.. వరుడి బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నవి కామన్.గడిచిన రెండు ఏళ్లలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.

కొందరు విడాకులు తీసుకొని విడిపోయిన వారు మరొక పెళ్లికి సిద్ధమవుతున్నారు.మరికొంతమంది ఏళ్ల తరబడి రిలేషన్ షిప్ లో ఉంటూ పెళ్లి వరకు వచ్చేసరికి బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో రెండవ పెళ్లి అనేది ట్రెండింగ్ గా మారిపోయింది.

మరి ఇటీవల రెండవ పెళ్లి చేసుకున్న వారిలో మంచు మనోజ్, ఆశిష్ విద్యార్థి, విష్ణు విశాల్ లాంటివి సెలబ్రిటీలు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

"""/" / ఇది ఇలా ఉంటే ప్రముఖ నటి తాజాగా రెండవ వివాహం చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.

యాక్ట్రెస్ సోమ్య సేథ్ తన ప్రియుడు శుభమ్ చౌహాడియా( Shubham Chuhadia )ను అమెరికాలో సీక్రెట్‌గా చేసుకుంది.

అయితే మొదట పెళ్లి, తర్వాత విడాకులు, సింగిల్ పేరెంట్‌గా ఇబ్బందులు పడిన సోమ్య తాజాగా తన రెండో పెళ్లి గురించి వెల్లడించింది.

నా భవిష్యత్తు బాగుండాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని నా పేరెంట్స్ చాలా ఆరాటపడ్డారు.

వారి కోరికను నెరవేరుస్తూ నేను రెండో పెళ్లి చేసుకున్నాను.నా కొడుకు ఐడెన్ కూడా శుభమ్‌ను చాలా ఇష్టపడుతున్నాడు.

వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.మా మ్యారేజ్ కోసం వాడు కూడా ఎదురు చూశాడు.

"""/" / మా ఇద్దర్నీ పెళ్లి గెటప్‌లో చూసి చాలా సంతోషపడ్డాడు అని చెప్పుకొచ్చింది సోమ్య.

కాగా ఈ జంట జూన్ 21న హల్దీ, మెహందీ వేడుక జరగ్గా 22న ఇరు కుటుంబాలు, తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సోమ్య సేథ్ ఓ స్టార్ హీరోకి మేనకోడలట.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, సోమ్య సేథ్( Soumya Seth ) కు మేనమామ అవుతారట.

ఈమె సోదరుడు కూడా నటుడే.ఇకపోతే శుభమ్ విషయాన్ని వస్తే.

చిత్తార్‌ఘడ్‌కు చెందిన శుభమ్, వాషింగ్టన్ డీసీలో ఆర్కిటెక్ట్‌గా వర్క్ చేస్తున్నాడు.సోమ్య తన అపార్ట్‌మెంట్‌లో ఒక గదిని అతనికి అద్దెకిచ్చింది.

ఫస్ట్ హౌస్‌మేట్, తర్వాత ఫ్రెండ్ అయ్యాడు.ఇక కోవిడ్ టైంలో ఒకరికొకరు సహాయంగా ఉంటూ మరింత దగ్గరయ్యారు.

అప్పుడే శుభమ్ తన జీవితంలోకి వస్తే బాగుంటుందనుకుంది సోమ్య.శుభమ్ కూడా తనను, కొడుకుని ప్రేమగా చూసుకునేవాడు.

ఇద్దరు కొంతకాలం ప్రేమలో ఉన్నారు.కొద్ది రోజుల తర్వాత విషయం పెద్దవారితో చెప్పగా సోమ్య శుభమ్‌ల ప్రేమకు పచ్చజెండా ఊపారు.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!