సీబీఐ చేతికి న‌టి సోనాలి ఫోగ‌ట్ హ‌త్య కేసు

హ‌ర్యానా న‌టి, బీజేపీ నేత సోనాలి ఫోగ‌ట్ హ‌త్య కేసు సీబీఐ చేతికి చేరింది.

సంచ‌ల‌నం సృష్టించి ఈ కేసును తీవ్ర ఒత్తిళ్ల న‌డుమ సీబీఐ ద‌ర్యాప్తుకు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించామ‌ని గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు.

గోవా టూర్ కు వెళ్లిన సోనాలి ఫోగ‌ట్.గ‌త నెల‌లో మృతిచెందిన విష‌యం తెలిసిందే.

ముందుగా గుండెపోటుగా భావించిన‌ప్ప‌టికీ.కుటుంబ స‌భ్యుల అనుమానాల నేప‌థ్యంలో గోవా పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

ఈ క్ర‌మంలో ఆమెది సాధార‌ణ మ‌ర‌ణం కాదని, హ‌త్యనే విష‌యం నిర్ధార‌ణ అయింది.

ఈ హత్య కేసులో సోనాలి వ్య‌క్తిగ‌త సిబ్బంది సుధీర్ సాంగ్వాన్ ప్ర‌ధాన నిందితునిగా పోలీస్ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే.

హ‌త్య జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుంచి ఆమె కుటుంబం సీబీఐ ద‌ర్యాప్తున‌కు డిమాండ్ చేస్తూ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ సీఎం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Wettbörsen Guide Für Deutsche Mobile-Player: Rubbellose Online Vernünftig Nutzen In Deutschland