Sonali Kulkarni :ప్రతి అమ్మాయికి రూ.50 వేలు జీతం వచ్చే అబ్బాయే కావాలి.. నటి వైరల్ కామెంట్స్!

నటి సోనాలి కులకర్ణి( Sonali Kulkarni ) గురించి అందరికీ తెలిసిందే.ఈమె ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

హిందీ మరాఠీ భాషలతో పాటు గుజరాతి, ఇటాలియన్, హాలీవుడ్, కన్నడ సినిమాలలో నటించి మెప్పించింది.

ఎక్కువగా హిందీ మరాఠీ సినిమాలలో నటించింది.కేవలం వెండి ధరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటించి మెప్పించింది సోనాలి కులకర్ణి.

1998లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె దాదాపుగా 75 పైగా సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

"""/" / ఈమె కేవలం నటి మాత్రమే కాదు రచయిత( Author ) కూడా.

ఇది ఇలా ఉంటే సోనాలి కులకర్ణి కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అలాగే సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన స్పందిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు షాకింగ్ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో కూడా నిలుస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అమ్మాయిల జీవితాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.దేశంలో చాలామంది అమ్మాయిలు బద్దకంగా( Girls Are Lazy ) మారారు.

అధిక జీతం వచ్చే అబ్బాయినే భర్తగా కోరుకుంటున్నారు. """/" / సొంత ఇల్లు 50 వేల రూపాయల శాలరీ మంచి ఇంక్రిమెంట్లు వచ్చే వ్యక్తిని భర్తగా రావాలని కోరుకుంటున్నారు.

మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు కావాల్సింది ఆఫర్ల లేక మంచి అబ్బాయిలా? అని ఆమె నిలదీసింది.

మంచి భర్తను కోరుకోండి ఆఫర్లను కాదు.కష్టసుఖాలను బాధ్యతలను ఇద్దరు సమానంగా పంచుకోవాలి అని ఆమె తెలిపింది.

సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan : కష్టాల్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షల రూపాయలు సాయం చేసిన చరణ్.. రియల్ హీరో అంటూ?