Salman Khan : సల్మాన్ ఖాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన మాజీ ప్రేయసి.. ఏం చెప్పారంటే?
TeluguStop.com

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Hero Salman Khan ) గురించి మనందరికి తెలిసిందే.


బాలీవుడ్ లో ఎన్నో సినిమా లలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.


అంతేకాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అంతా బాగానే ఉంది కానీ సల్మాన్ ఖాన్ అభిమానులు ఇప్పటికీ నిరాశ చెందుతున్న ఒకే ఒక విషయం ఏమిటంటే సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాకపోవడమే.
ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు సల్మాన్ ఖాన్.అయితే పెళ్లి చేసుకోక పోయినప్పటికీ ఇప్పటికే బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగించాడు.
"""/" /
అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయినా కత్రినా కైఫ్, ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) వంటి వారిని పేర్లు కూడా వినిపించాయి.
అలా సల్మాన్ ఖాన్ తో కొంతకాలం పాటు రిలేషన్ లో ఒక నటి తాజాగా సల్మాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ ఆ నటి ఎవరు? సల్మాన్ ఖాన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది అన్న వివరాల్లోకి వెళితే.
ఆ నటి పేరు సోమీ అలీ.ఈమె పాకిస్థానీ అమెరికన్.
హిందీలో ఆందోళన్, మాఫియా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక మూవీలో నటించింది.
షూటింగ్ జరుగుతున్న సమయం లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్లు రూమర్స్ కూడా వచ్చాయి.
అయితే సడన్ గా ఏమైందో ఏమో గానీ ఆ సినిమా ఆగిపోయింది. """/" /
సల్మాన్-సోమీ అలీ( Somi Ali ) కూడా విడిపోయారు.
ఆ తర్వాత పలు సందర్భాల్లో సల్మాన్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సల్మాన్- సంగీత విడిపోవడానికి కారణం నేను.నిజానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
కానీ సల్మాన్‌కి పెళ్లి ఇష్టం లేదు.దీంతో నన్ను ఉపయోగించుకుని అది ఆగిపోయేలా చేశాడు.
వాళ్ల వివాహానికి అంతా సెట్ అయిన తర్వాత నన్ను హెల్ప్ అడిగాడు.ఇద్దరం కలిసి నా అపార్ట్‌మెంట్‌లో సంగీత మమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
దీంతో వాళ్ల పెళ్లి క్యాన్సిల్ అయింది.సంగీత విషయంలో ఏం చేశాడో సరిగ్గా అలానే నాకూ చేశాడు.
కాకపోతే పెద్దయ్యాక దీన‍్ని అర్థం చేసుకున్నా అని నటి సోమీ అలీ చెప్పుకొచ్చింది.
క్యూట్ వీడియో.. స్టేజీపై నుంచే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సినిమా డైరక్టర్.. చివరకు?