స్నేహకు అలాంటి వ్యాధి ఉందా… భయంకర విషయాలు బయటపెట్టిన స్నేహ భర్త!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న స్నేహ( Sneha ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఈమె అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అక్క వదిన పాత్రలలో నటిస్తూ ఉన్నారు.
ఇక స్నేహ తమిళ నటుడు ప్రసన్నను( Prasanna ) వివాహం చేసుకున్న సంగతి తెలిసినదే .
ప్రస్తుతం దంపతులు ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. """/" /
ఇక ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎంతోమంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు.
అయితే పలు సందర్భాలలో ఆ వ్యాధుల గురించి బయటపెడుతూ ఉంటారు.తాజాగా నటి స్నేహ సైతం అలాంటి వ్యాధితో బాధపడుతున్నారని ఆమె భర్త ప్రసన్న ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
స్నేహ ఓసిడి ప్రాబ్లంతో ( OCD Problem ) బాధపడుతున్నారని ప్రసన్న ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఆమెకు ఇంట్లో చెత్తగా ఉంటే అసలు నచ్చదు ప్రతి ఒక్కటి చాలా నీట్ గా ఉండాలి.
ఎప్పుడు ఇల్లు మొత్తం సర్దుతూనే ఉంటుందని తెలిపారు. """/" /
స్నేహ ఈ సమస్య కారణంగా ఇప్పటికే నాతో మూడు ఇల్లులు మార్పించింది.
ఇంట్లో అది బాలేదు ఇది బాలేదు ఇది నీట్ గా లేదు అది నీట్ గా లేదు అని ఎప్పుడూ సర్దుతూనే ఉంటుంది.
ఇప్పటికే మూడు ఇండ్లు మారామని నన్ను తప్ప ఇంట్లో అన్ని మార్చేస్తుంది అంటూ ఈ సందర్భంగా ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అయితే స్నేహ ఈ విషయానికి కల్పించుకొని.నాకు ఇంట్లో నీటుగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది లేదంటే చాలా చిరాకుగా ఉంటుందని ప్రశాంతంగా ఉండలేనని స్నేహ తెలియజేశారు.
ఆ పొరపాటు చేశానని ఒప్పుకున్న సురేఖవాణి కూతురు.. సారీ చెబితే సరిపోతుందా?