Actress Shubha : షూటింగ్లో నటికి భయంకర అనుభవం.. కత్తులతో బెదిరించి అసభ్యంగా అలా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్ లకు అభిమానులు ఉండడం అన్నది కామన్.

అయితే కొన్ని కొన్ని సార్లు ఆ అభిమానుల వల్ల సెలబ్రిటీలు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.

అభిమానులు మితిమీరి చేసే కొన్ని పనుల వల్ల సెలబ్రిటీలకు ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు.

ఇప్పటికే గతంలో అలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.తాజాగా కూడా ఒక మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటన మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

అంతే కాకుండా అది సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా కూడా మారిపోయింది. """/" / అసలేం జరిగిందంటే.

కర్ణాటకలోని చిక్కమగళూరు( Chikkamagalur In Karnataka ) లోని ఒక ప్రాంతంలో కొరగజ్జ అనే సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది.

నటి శుభం పూంజా( Actress Shubham Poonja ), బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య సెట్‌లో ఉన్నారు.

సడన్‌గా బైకుపై కొందరు దుండగులు కత్తులతో అక్కడికి వచ్చారు.నటి శుభంతో అసభ్యంగా ప్రవర్తించారు.

అంతటితో ఆగని ఆ దుండగులు కత్తులతో ఆమెను బెదిరించి, చేయిపట్టుకొని లాగారట.దాంతో షూటింగ్ నిలిచిపోయిందట.

అయితే ఆ సంఘటన కుద్రేముఖ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగినప్పటికీ దీనిపై పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదట.

మరోవైపు మీడియాతో మాట్లాడిన దర్శకుడు సుధీర్( Directed Sudhir ).లక్షలు ఖర్చుపెట్టి సెట్ వేసి, అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాము.

"""/" / కానీ ఇప్పుడు ఇలా జరగడంతో షూటింగ్ అంతా ఆపేయాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.అంతేకాకుండా ఈ ఘటనపై సదరు నటి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలి అంటే సదరు నటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఆ దుండగులు ఎవరు అభిమానుల లేదంటే ఇతర వ్యక్తుల అన్నది తెలియాల్సి ఉంది.

తారక్ బాలీవుడ్ లో మరో మూవీ చేయనున్నారా.. ఆ మాటల వెనుక అర్థం ఇదేనా?