Salaar Movie : సలార్ సినిమా కారణంగా హాస్పిటల్ పాలైన నటి.. సర్జరీ కూడా..!!

భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ సినిమా (Salaar Movie) గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాని ఒకసారి చూసిన చాలా మంది జనాలు మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇష్టపడుతున్నారు.

ఇక ఈ సినిమాలోని పాత్రలన్నింటినీ చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఇక ఈ సినిమాలో ప్రభాస్,(Prabhas) శృతిహాసన్, పృధ్విరాజ్ వంటి వారితో పాటు మరో నటికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఆమె ఎవరో కాదు విశాల్ వదిన నటి శ్రీయా రెడ్డి.ఈమె సలార్ సినిమాలో రాధా రామ( Radharama Role ) అనే పాత్ర పోషించింది.

ఇక ఈ సినిమాలో లేడీ విలన్ గా చేసిన శ్రియ రెడ్డి రాధా రామ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది.

"""/" / అంతేకాదు ఈ పాత్ర పోషించడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి.

ఈ సినిమా కారణంగా నేను హాస్పిటల్ పాలయ్యాను అని కూడా చెప్పుకొచ్చింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి (Shriya Reddy) మాట్లాడుతూ.నేను సలార్ సినిమాలో పోషించిన పాత్ర కోసం పెద్దపెద్ద చెవి కమ్మలు పెట్టుకోవాల్సి వచ్చింది.

అలా పెట్టుకున్న క్రమంలో నా చెవులు మొత్తం చీరుకుపోయాయి. """/" / దాంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్ కి వెళ్లి సర్జరీ ( Surgery ) కూడా చేయించుకోవలసి వచ్చింది.

అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) అందరినీ డార్క్ కలర్స్ లో చూపించారు.

అంతేకాదు వేసుకునే బట్టలు కూడా డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి.అలా ఆలివ్ గ్రీన్, బ్లాక్, గ్రే వంటి కలర్స్ మాత్రమే ఉపయోగించారు.

అయితే ఆ సమయంలో నాకు కూడా అలాంటి కలర్ సారీనే ఇచ్చారు.కానీ నేను కుదరదని ఎల్లో కలర్ సారీ కట్టుకున్నాను.

అయితే డైరెక్టర్ వద్దని వారించారు.ఇక ఆ డైరెక్టర్ ఎంత చెప్పినా వినకుండా నేను మాత్రం ఎల్లో కలర్ సారీనే కట్టుకున్నాను అంటూ శ్రియా రెడ్డి చెప్పుకొచ్చింది.

ఇక శ్రియా రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేస్తున్న ఓజి సినిమాలో( OG Movie ) కూడా ఒక కీలక పాత్రలో చేస్తుందట.

ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్ లకు మాత్రమే సొంతమైన ఈ రేర్ రికార్డ్ గురించి తెలుసా?