పవన్ అద్భుతాలు సృష్టిస్తారు.. డిప్యూటీ సీఎం పై ప్రశంసలు కురిపించిన నటి?
TeluguStop.com
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఈయనకు రాజకీయాలపై ఆసక్తి రావడంతో జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించి రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు.
అయితే గత పది సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేస్తూ ఎంతో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ మొదటిసారి సక్సెస్ అందుకున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ సాధించారు.
అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
"""/" /
ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా రాజకీయాల పరంగా సాధించిన ఈ సక్సెస్ పై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందించిన సంగతి తెలిసిందే.
ఇలా ఎంతోమంది పవన్ కళ్యాణ్ విజయం పై సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా నటి శ్రేయ( Shriya ) సైతం ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను తెలియజేశారు.
"""/" /
పవన్ కళ్యాణ్ విజయం తనకెంతో గర్వంగా ఉందని వెల్లడించారు.పవన్ కళ్యాణ్ తో కలిసి తాను బాలు సినిమాలో( Balu Movie ) నటించాను.
ఆయన పని పట్ల ఎంతో శ్రద్ధ చూపించే వ్యక్తి.ప్రజలు ఆయనని ఎన్నుకొని ఎంతో మంచి పని చేశారని వెల్లడించారు.
ఓసారి బాలు సినిమా సాంగ్ షూటింగ్లో భాగంగా ఆయన కాలికి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది కానీ ఆ విషయాన్ని షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎవరికీ చెప్పలేదు.
ఆయన ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలనే తపన పడతారని శ్రేయ వెల్లడించారు.పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు అంటూ ఈమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక నటుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ మరోసారి చిరంజీవితో తనకు స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..ఆ జానర్ లో రాబోతోందా?