యాంకర్ ప్రదీప్ పై మనసు పారేసుకున్న నటి… తనే నా క్రష్ అంటూ కామెంట్స్

సాధారణంగా కొందరు నటీ నటుల పై అభిమానులకు క్రష్ ఉండటం సర్వ సాధారణం.

అయితే కొన్ని సార్లు నటీనటులపై మరికొందరు సెలబ్రిటీలకు కూడా క్రష్ ఉంటుంది.ఈ క్రమంలోనే బుల్లి తెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ అంటే తనకు క్రష్ అని నటి శ్రద్దా దాస్ వెల్లడించారు.

ప్రదీప్ యాంకర్ గా ఈటీవీలో ఢీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నటి శ్రద్దా దాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

"""/" / ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే యాంకర్ ప్రదీప్ తన మాటలతో అందరిపై పంచులు చేస్తూ అందరిని నవ్వించారు.

అదేవిధంగా నటి శ్రద్ధాదాస్ తో డాన్స్ చేశారు.ఇలా ప్రదీప్ తో కలిసి డాన్స్ చేసిన అనంతరం ఈమె తనపై ఉన్నటువంటి క్రష్ గురించి బయటపెట్టారు.

ప్రదీప్ కు తనకు ఓ క్రష్ ఉందని, అది భవిష్యత్తులో ఎంత దూరమైనా వెళ్లచ్చని ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ ప్రదీప్ తో తనకు ఉన్నటువంటి క్రష్ గురించి బయట పెట్టారు.

"""/" / ఇలా ప్రదీప్ గురించి శ్రద్ధ దాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక శ్రద్ధ దాస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని ఫోటోలను విషయాలను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటారు.

నటిగా పలు సినిమాలలో సందడి చేసిన శ్రద్ధాదాస్ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్28, గురువారం 2024