శిల్పాశెట్టి ధరించిన చీర, నగల ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

గతేడాది వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన సీనియర్ హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరనే సంగతి తెలిసిందే.

తెలుగులో పెద్దగా పాపులారిటీని సంపాదించుకోలేకపోయినా హిందీలో మాత్రం శిల్పాశెట్టి ఖాతాలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు ఉన్నాయి.

శిల్పాశెట్టి చీర, నగలతో దిగిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నటనతో పాటు ఫిట్ నెస్ తో కూడా శిల్పాశెట్టి పాపులారిటీ సంపాదించుకున్నారు.ప్యాషన్ గురించి శిల్పాశెట్టి మాట్లాడుతూ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే మొదట హెల్తీగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.

అందువల్ల తాను ఫ్యాషన్ తో పోల్చి చూస్తే ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తానని శిల్పాశెట్టి కామెంట్లు చేశారు.

శిల్పాశెట్టి ధరించిన చీర ఖరీదు ఏకంగా 30,000 రూపాయలు కావడం గమనార్హం.ఈ చీర ప్రింట్స్ బై రాధిక బ్రాండ్ కు సంబంధించిన చీర కాగా చీరలో శిల్పాశెట్టి చాలా అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు శిల్పాశెట్టి ధరించిన జ్యూయెలరీ మొజాటీ బ్రాండ్ జ్యూయెలరీ కాగా ఈ జ్యూయెలరీ ఖరీదు మాత్రం కేవలం 4,350 రూపాయలు కావడం గమనార్హం.

"""/" / హిందీలో బాజీగర్ సినిమాతో శిల్పాశెట్టి కెరీర్ మొదలైంది.తెలుగు, హిందీ భాషలతో పాటు కన్నడ భాషలో కూడా ఆమె నటించారు.

శిల్పాశెట్టి మాతృభాష తుళు కాగా 2010 సంవత్సరం తర్వాత శిల్పాశెట్టి సినిమాలకు దూరంగా ఉన్నారు.

"""/" / అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ శిల్పాశెట్టి పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు.

సోషల్ మీడియాలో కూడా శిల్పాశెట్టి యాక్టివ్ గా ఉంటూ వేర్వేరు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

శిల్పాశెట్టి రాజ్ కుంద్రాతో విడిపోతారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

శిల్పాశెట్టి మళ్లీ కెరీర్ విషయంలో బిజీ కావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

వైరల్ వీడియో: మంచు కొండల్లో హుక్ స్టెప్ తో రెచ్చిపోయిన సీనియర్ హీరోయిన్..