హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే నిర్మాతలతో అలా ఉండాల్సిందే.. నటి కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచం బయటకు ఒకలా కనిపిస్తే, లోపల లోపల వేరే విధంగా ఉంటుంది అని ఉంటూ ఉంటారు.

ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నటీమణులు కమిట్మెంట్ కల్చర్ గురించి అనేకసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇదే విషయం గురించి సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం అన్నది కూడా పుట్టుకొచ్చింది.

ఈ మీటూ ఉద్యమంలో ఎంతోమంది హీరోయిన్లు వారి జీవితంలో ఎదురకొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన నటి షామా సికిందర్ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ జీవితంలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.

ఇంతకుముందు ఉన్న విధంగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ విధంగా లేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటున్నారు.

హీరోయిన్లకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు.గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా సేఫ్ గా ఉంది అని చెప్పవచ్చు అని తెలిపింది షామా.

అయితే ఒకప్పుడు దర్శక నిర్మాతలు హీరోయిన్లను వారితో గడపాలని ఇబ్బంది పెట్టేవారు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

కాగా అప్పట్లో చాలామంది పేరు ఉన్న దర్శక నిర్మాతలు వారితో పని చేయకపోయినా కూడా తమతో సన్నిహితంగా ఉండాలని అడిగేవారు అని చెప్పుకొచ్చింది షామా.

"""/"/ అయితే అప్పుడు నేను ఆశ్చర్యం వేసి మీతో కలిసి ఎటువంటి పని చేయకపోయినా కూడా మీతో స్నేహంగా ఎలా ఉండాలి అని నేను అడిగేదాన్ని అని చెప్పుకొచ్చింది షామా.

అ‍ప్పుడు వారు నీకు పని కావాలంటే మాతో చనువుగా ఉండాలి.మాతో బెడ్‌ షేర్‌ చేసుకోవాలి అని చెప్పేవారు.

అప్పటి హీరోయిన్లు అంతా ఇండస్ట్రీలో అభద్రతా భావంతో ఉండేవారు.అవకాశాలు కావాలంటే దర్శక,నిర్మాతల కోరికలు తీర్చాల్సిందే.

అలా చేస్తేనే అవకాశాలు ఉండేవి.కానీ ఇప్పుడు అలా కాదు.

అలా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పను.ఉంది.

కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది అని చెప్పుకొచ్చింది షామా.

అమెరికా : జాహ్నవి కందుల మరణంపై హేళన .. ఆ పోలీస్ అధికారిని తొలగించిన ప్రభుత్వం