చాలా కుంగిపోయాను చనిపోవాలని అనుకున్నా.. నటి సంచలన వ్యాఖ్యలు?
TeluguStop.com
సినిమా సెలబ్రిటీలకు కూడా సామాన్యులలా కష్టాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.అయితే చాలామంది సెలబ్రిటీలు ఆ కష్టాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.
ప్రముఖ నటి నందిని రాయ్ తాను టెర్రస్ పై నుంచి దూకి చనిపోవాలని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు.నందినీ రాయ్ అంతర్జాతీయ మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
నందినీ రాయ్ మిస్ హైదరాబాద్ కిరీటాన్ని దక్కించుకోవడంతో పాటు మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ గా కూడా నిలిచారు.
040 అనే సినిమాతో నందినీ రాయ్ సినీ ప్రయాణం మొదలైంది.తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో నటించిన నందినీ రాయ్ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయారు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నందినీ రాయ్ కు మంచి గుర్తింపు దక్కిందనే సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్2లో నందినీ రాయ్ కూడా ఒక కంటెస్టెంట్ అనే సంగతి తెలిసిందే.
అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాకపోవడంతో నందినీ రాయ్ కెరీర్ విషయంలో తను అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం నందినీ రాయ్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న పలు వెబ్ సిరీస్ లలో నటించడం గమనార్హం.
కెరీర్ తొలినాళ్లలో నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆమె అన్నారు. """/"/
ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నానని నందినీ రాయ్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత నా ఆలోచన తప్పని అర్థమైందని ఆమె కామెంట్లు చేశారు.సైకలజికల్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడ్డానని నందినీ రాయ్ తెలిపారు.
నందినీ రాయ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రముఖ హీరోయిన్ నందినీ రాయ్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ కేసు నుంచి బయట పడతాడా..?