గర్భవతి గా ఉన్న నన్ను చిత్రహింసలు పెట్టాడు : నటి సరిత

తెలుగు సినీ నటి సరిత( Actress Saritha ) తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో 500 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి చాలా మంచి గుర్తింపు దక్కించుకుంది.

1980లలో ఆమె స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణించింది.ఈ ముద్దుగుమ్మ వాయిస్ చాలా బాగుంటుంది.

అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.నగ్మా, విజయశాంతి, టబు, సుష్మితా సేన్, రమ్యకృష్ణ, సౌందర్య వంటి అగ్ర హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.

కెరీర్ లైఫ్ లో ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం నరకం అనుభవించింది.

ముఖ్యంగా మొదటి పెళ్లి అయిన తర్వాత ఆమె చిత్ర హింసలకు గురైంది.సరిత 1975లో వెంకట సుబ్బయ్యను పెళ్లాడింది.

అయితే వీరి పెళ్లి ఏడాది తర్వాత ముగిసింది.ఆ తర్వాత ఆమె 1988లో మలయాళం యాక్టర్, ప్రొడ్యూసర్ ముఖేష్ మాధవన్‌ను పెళ్లి చేసుకుంది.

2011లో అతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది.సరిత చాలా సంవత్సరాలు తన జీవితంలో జరిగిన హింసాత్మాక సంఘటనల గురించి ఎవరితోనూ చెప్పలేదు.

కానీ, చివరికి ఆమె తన అనుభవాల గురించి ఒక పత్రికకు చెప్పింది.ముఖేష్( Mukesh ) ఎంత చిత్రహింసలు పెట్టాడో తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

"""/" / సరిత మాట్లాడుతూ "నేను జరిగిన దాని గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాను.

ఇలాంటి హింసలకు గురవుతానని నేను ఊహించలేదు.నేను చాలా సినిమాల్లో నటించాను.

ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూశాను.కానీ, ఇది నా జీవితంలో నిజంగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.

" అని చెప్పింది.సరిత భర్త ముకేష్ ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడని, తనని మాత్రం చాలా హింసించేవాడని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ "నేను నా కష్టాల గురించి ఎవరితోనూ చెప్పడానికి ఇష్టపడలేదు.కొంతమంది నా కష్టాలు తెలుసుకుని నన్ను కలిసినప్పుడు, నేను అబద్ధం చెప్పాను.

మా మధ్య అంతా బాగానే ఉందని చూపించడానికి, ఓణం వంటి పండుగల్లో మేం సంతోషంగా ఉన్నట్లు ఫోటోలు తీయించుకున్నాము.

కానీ, ముకేష్ ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటూనే ఉన్నాడు.అతను తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తాడని నేను ఆశతో ఉండేదాన్ని.

" అని చెప్పింది.సరిత తన గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి కూడా చెప్పింది.

"నేను గర్భవతిగా ఉన్నప్పుడు, అతను నా కడుపుపై కాలితో తన్నాడు.దాంతో నేను కింద పడిపోయాను.

చాలా ఏడ్చాను.ఆ సమయంలో, నన్ను చూసి నవ్వుతూ, 'అబ్బా, నువ్వు చాలా బాగా నటిస్తావు.

ఇంకా ఏడువు' అని అన్నాడు.అతను నన్ను బాధించడానికి ఎప్పుడూ కొత్త మార్గాలు కనుక్కొనేవాడు.

ఒకసారి, నేను తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, మేం డిన్నర్‌కు వెళ్లాం.తిరిగి వస్తున్నప్పుడు, కారులో ఎక్కాలనుకున్నప్పుడు, అతను కారును ముందుకు వెనుకకు తిప్పుతూ నన్ను మోసం చేయాలని చూశాడు.

నేను కారు వెంట పరుగెత్తినప్పుడు, నేను పడిపోయి అక్కడే కూర్చుని ఏడ్చాను.అతను నవ్వుతాడని భయపడి, నా కన్నీళ్లను దాచడానికి ప్రయత్నించాను" అని చెప్పింది.

"""/" / సరిత మరొకసారి తన భర్త తనను కొట్టిన సంఘటన గురించి చెప్పింది.

"మరోసారి, అతను మధ్యరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చినప్పుడు, నేను అతనితో సాధారణంగా అతను ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చాడని అడిగాను.

అతను నా జుట్టు పట్టుకొని నన్ను నేల మీద లాగి, నన్ను కొట్టాడు" అని చెప్పింది.

ముకేష్ తండ్రికి ఇచ్చిన ఒక మాట కారణంగా ఇంతకు ముందు దాక ఆయన దౌర్జన్యాలు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

"నా తండ్రి చనిపోయిన తర్వాత, నేను ముకేష్ తండ్రిని నా తండ్రిలా చూసుకోవడం మొదలుపెట్టాను.

నేను అతనికి నా మాట ఇచ్చాను, అందుకే నేను పోలీసుల వద్దకు వెళ్లలేదు.

అతను చనిపోయే రోజు వరకు నేను ఆ మాట నిబంధించాను.ముకేష్ నన్ను అతని పనివారు ముందు కొట్టినప్పుడు, నేను అతని ఇంటికి వెళ్లడం మానేసాను.

ఒకసారి అతని తండ్రి పన్ను విషయాల కోసం తిరువనంతపురం వచ్చినప్పుడు, నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు.

విమానాశ్రయంలో, 'ఇంటికి వెళ్దాం' అని అన్నాడు.నేను రావడం లేదని, పంకజ్ హోటల్‌లో రూం తీసుకున్నానని చెప్పాను.

డ్రైవర్ ముందు అతను ఏమీ చెప్పలేదు కానీ తర్వాత నా రూమ్‌కు వచ్చాడు.

అతను నా చేతులు పట్టుకొని, నేను ఎలా ఉన్నానో అతనికి తెలుసని, అతని కొడుకు తప్పు చేశాడని చెప్పాడు" అని పేర్కొంది.

సరిత ఇన్ని చిత్రహింసలను భరించిందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

స్టార్ హీరోలు అయితే అలాంటి సినిమాలు చేయకూడదా..?