Sharanya Pradeep : మంచి పాత్ర దొరకడంతో హీరోను మించి దుమ్మురేపిన శరణ్య ప్రదీప్…

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య ప్రదీప్ ( Artist Saranya Pradeep )గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు ఈ ముద్దుగుమ్మ 2017లో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమాలో కనిపించింది.

అందులో సాయి పల్లవి సిస్టర్ రోల్ చేసింది.సినిమా రంగంలోకి రాకముందు, శరణ్య టీవీ న్యూస్ యాంకర్‌గా పనిచేసింది, కానీ చిన్నప్పటి నుండి వెండితెరపై నటించాలని కోరుకుంది.

ఆ కోరికను ఆమె తన ప్రతిభతో నెరవేర్చుకుంది.తాజాగా ఆమె నటించిన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా( Ambajipet Marriage Band Movie ) రిలీజ్ అయింది.

ఇందులో సుహాస్‌, శివానీ నగారం తదితరులు కూడా నటించారు.ఈ సినిమాలో సుహాస్‌ అక్క పద్మ పాత్రలో శరణ్య నటించింది.

అయితే ఈమె పాత్రకు హీరోకి తగినంత ప్రాధాన్యత ఉంటుంది.ఆమె క్యారెక్టర్జేషన్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది.

ఈ పాత్రను ఎంత చక్కగా డిజైన్ చేశారో అంత అద్భుతంగా శరణ్య నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.

సినిమా అంతటా ఆమె కనిపించేలాగా ఈ మూవీని రూపొందించారు.మంచి క్యారెక్టర్ దొరకడంతో ఈ తెలంగాణ పిల్ల తన నట విశ్వరూపం చూపించింది.

ఈ సినిమాలో ఆమెకు కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాలు కూడా రాశారు.వాటన్నిటిలో చాలా మెచ్యూరిటీతో ఆమె నటించిన తీరు థియేటర్లలో చప్పట్లు కొట్టించింది.

"""/" / శరణ్య మొన్నటిదాకా మామూలు సహాయక పాత్రలో నటిస్తూ వస్తోంది.మంచి పాత్ర వస్తే ఇరగదీసే టాలెంట్ ఉన్న ఆమెకు డైరెక్టర్లు ఇప్పటిదాకా మంచి రోల్ ఇచ్చింది లేదు.

కానీ దుష్యంత్ మాత్రం ఆమెలో గొప్ప నటిని చూశాడు.అందుకే అంత మంచి క్యారెక్టర్ డిజైన్( Character Design ) చేయగలిగాడు.

చాలా రియలిస్టిక్ గా, మంచి కథతో వచ్చిన ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది.

అంతేకాదు ఈ సినిమా తర్వాత శరణ్యకు కుప్పలు తెప్పలుగా పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

శరణ్య జాను సినిమాలో కూడా నటించింది, పుష్పక విమానం, కృష్ణ వ్రింద విహారి వంటి హిట్ సినిమాల్లో కూడా ఈ తార మెరిసింది.

"""/" / పిచ్చిగంతులు వేసే హీరోయిన్ల కంటే చక్కగా నటించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే శరణ్య లాంటి నటీమణులు తెలుగులో చాలా అరుదుగా ఉన్నారని చెప్పుకోవచ్చు.

వారిని డైరెక్టర్లు గుర్తించి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేస్తే ప్రేక్షకులను తప్పకుండా ఆదరిస్తారు.

4 సెకన్లకు కోటి రూపాయలు.. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఇంతకు మించి సాక్ష్యం కావాలా?