ఆ విషయంలో నేను చాలా వీక్.. సీనియర్ హీరోయిన్ సంగీత కామెంట్స్ వైరల్!

ఆ విషయంలో నేను చాలా వీక్ సీనియర్ హీరోయిన్ సంగీత కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆ విషయంలో నేను చాలా వీక్ సీనియర్ హీరోయిన్ సంగీత కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత.ప్రస్తుతం బుల్లి తెర పై ప్రసారమవుతున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఆ విషయంలో నేను చాలా వీక్ సీనియర్ హీరోయిన్ సంగీత కామెంట్స్ వైరల్!

అంతేకాకుండా అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ.నేను చిన్నప్పటి నుంచి చాలా లావుగా ఉండే దాన్ని.

అంతేకాకుండా నాకు స్కిన్ కి సంబంధించిన సమస్యలు ఉండేవి.జ్యువలరీ కు నాకు అస్సలు పడదు అవి వేసుకుంటే ఎలర్జీ వస్తుంది.

ఇక అప్పట్లో నేను ఎవరితో ఎక్కువగా కలిసేదానిని కాదు,మాట్లాడే దానిని కాదు అని తెలిపింది సంగీత.

షూటింగ్ కి రావడం షూటింగ్లో పాల్గొనడం అయిపోగానే ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం లాంటివి చేసే దానిని.

నటి అంటే అందరితో కలిసిపోతూ జనంలోకి చొచ్చుకుపోయే లక్షణం ఉండాలి కానీ నాకు అప్పుడు అవి ఏమీ తెలియదు అందుకే చాలామంది నన్ను హీరోయిన్ మెటీరియల్ కాదు అని అన్నారు అని చెప్పుకొచ్చింది సంగీత.

అంతేకాకుండా నాకు ఎటువంటి నెట్వర్క్ కూడా ఉండేది కాదు. """/" / ఆ సమయంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఆ విషయంలో నేను చాలా వీక్ అని తెలిపింది సంగీత.

ఒకవేళ నేను సినిమాలో నటిస్తే అది ఎక్కడ జరుగుతుంది అన్న విషయం తప్పితే ఎవరెవరు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు అన్న విషయం కూడా నేను పెద్దగా పట్టించుకోను నా పని నేను చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది సంగీత.

ఇకపోతే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంగీత సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.. గ్రేట్ అంటూ?