ఆడపిల్లలే ముద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్!
TeluguStop.com
ఆరేళ్ల క్రితం హాట్ బ్యూటీ.ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ముద్దుల తల్లైన సమీరారెడ్డి కంటే కూతుర్నే కనాలంటూ తనలోని మరోయాంగిల్ ను బయటపెట్టింది.
టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.
ఆ తరువాత అశోక్, మెగస్టార్ చిరంజీవితో జై చిరంజీవ సినిమా తో అందర్ని అలరించింది.
తమిళంలో 2002 నుంచి 2013 వరకు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది.
కానీ అనూహ్యంగా 2014లో తాను రెండేళ్ల పాటు ప్రేమించిన అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది.
అప్పటి నుంచి వెండి తెరకి దూరంమై హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.
ఎక్కువగా పబ్లిక్ లో అవెర్నెస్ క్రియేట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తుంది.
సమీరారెడ్డి గతేడాది రెండో సంతానంగా ఆడ పిల్లకు జన్మనిచ్చింది.డెలివరీకి ముందు ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో కొన్నిస్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.మీరు లావుగా ఉన్నారని కామెంట్ చేస్తే.
మరికొందరు హాట్ గా ఉన్నావంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు.దీంతో బాడీషేమింగ్ పై సమీరా మండిపడింది.
అంతేకాదు మీరు పుట్టినప్పుడు మీ అమ్మ హాట్ గా ఉందా అంటూ ప్రశ్నించింది.
తాజాగా హార్ట్ ఫుల్ కామెంట్ తో సమీరా రెడ్డి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ప్రతీ పుట్టుక కారణం ఆడపిల్లే.
అంతెందుకు మనల్ని పుట్టించిన అమ్మకూడా ఆడపిల్లే.అదే ఆడపిల్ల మనఇంట్లో పుడితే భారంగా ఫీలవుతాం.
వద్దనుకుంటాం.పొత్తిళ్లలోనే గొంతునొక్కేస్తాం.
కానీ సమీరా రెడ్డి మాత్రం ఆడపిల్లలకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది.అమ్మాయి పుడితే ఎందుకు భారంగా ఫీలవుతున్నారో అర్ధం కావడంలేదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
డబ్బులేనోడైనా.ఉన్నోడైనా ఆడపిల్లల సంతానం విషయంలో తారతమ్యాలు చూపిస్తున్నారు.
మొదటి సంతానం అమ్మాయి కాకుండా అబ్బాయినే కోరుకుంటారు.ఎందుకలా…? ఫస్ట్ మీ ఆలోచన మారాలి.
మేం ముగ్గురం ఆడపిల్లలం మేం సంతోషంగా ఉన్నాం అంటూ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఓజీ మూవీలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందా..?