Samantha : ఓజోన్ థెరపీ చికిత్సలో నటి సమంత… ఇంకా వ్యాధి నయం కాలేదా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Heroine Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.
సమంత ఇటీవలె అనారోగ్య పరిస్థితుల రీత్యా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటోంది.అలాగే ఇప్పుడిప్పుడే ఆ అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.
ఇటీవల పలు దేశాలు తిరిగి తన మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ చూసుకుంటోంది సమంత.
"""/"/
త్వరలోనే సామ్ మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా( Social Media )లో ట్వీట్ కూడా చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తన ఫిట్నెస్ విషయంపై ప్రత్యేకంగా జాగ్రత్తలు వహిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది సమంత.
తరచూ ఏదో ఒక పోస్ట్ తో సోషల్ మీడియాలో నిలిచే సమంత తాజాగా మరోసారి మరో పోస్ట్ తో సోషల్ మీడియాలో నిలిచింది.
తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓజోన్ తెరపి( Ozone Therapy ) అంటూ తాను తీసుకుంటున్న ట్రీట్మెంట్ గురించి ఒక ఫొటోను షేర్ చేసింది.
"""/"/
ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఏంటి సమంతకు ఇంకా ఆరోగ్యం బాగు కాలేదా ఇంకా సమస్యతో బాధపడుతూనే ఉందా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సమంత ఎప్పుడెప్పుడు ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సమంత సినిమాల విషయానికి వస్తే.ఈమె గత ఏడాది ఖుషి సినిమా( Kushi Movie )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత సమంత చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితులు ఆమె అడ్వాన్స్ ని కూడా నిర్మాతలకు తిరిగి విచ్చేసిన విషయం తెలిసిందే.
దీంతో సమంత రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఖర్జూరం, తేనె కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందవచ్చో తెలుసా..?