సమంత విడాకులపై స్పందించిన సదా.. ఏమన్నారంటే?

జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సదా మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నారు.

ఇలా మొదటి సినిమా మంచి విజయం కావడంతో తనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

సదా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉంటూ ఒకానొక సమయంలో అగ్రతారగా వెలిగారు.

ఇకపోతే సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ విధంగా కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైన ఈమె తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా ఈమె ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అందరూ తనని పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారని ఈమె తన పెళ్లి గురించి మాట్లాడారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/08/actress-sadaa-comments-on-samantha-nagachaitanya-orce-detailsa!--jpg "/ పెళ్లి అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే పెళ్లే జీవితం కాదని చెప్పుకొచ్చారు.

అయినా ప్రస్తుత కాలంలో వివాహ బంధం పెద్దగా నిలబడలేదని ఆ బంధం పై తనకు నమ్మకం లేదని తెలిపారు.

ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకున్న పదిమంది జంటలలో కేవలం 5 మంది మాత్రమే కలసి ఉన్నారని, మిగతా ఐదు మంది విడాకులు తీసుకుని విడిపోయారంటూ ఈమె కామెంట్ చేశారు.

ఇలా విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ సదా మాట్లాడటంతో ఈమె పరోక్షంగా సమంత నాగచైతన్య విడాకులను ఉద్దేశించి మాట్లాడారని పలువురు భావిస్తున్నారు.

ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీతారకు మహేష్ దంపతుల బర్త్డే విషెస్.. వైరల్ పోస్ట్..