అలా అవమానించడంతో చాలా బాధేసింది.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన వీఎస్ రూపా లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిరంజీవి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బలంగా అనుకుంటే అనుకున్నది కచ్చితంగా సాధించగలవని చెప్పారని ఆమె తెలిపారు.
నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రదర్ ఫ్రెండ్ ఒక ఛాన్స్ విషయంలో హెల్ప్ చేశారని ఆమె తెలిపారు.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.సీన్ చెప్పినదానిని తర్వాత మార్చితే నేను నో చెప్పిన సందర్భాలు ఉన్నాయని ఆమె అన్నారు.
నేను ఫేస్ చేసిన సందర్భంలో ఆ సమస్య కొత్తగా అనిపించిందని ఆమె అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ఛేంజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉండేదని ఆమె కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగుందని ఆమె వెల్లడించారు.అప్పట్లో సినిమాలలో ఎంపిక కావాలంటే ఫోటోలు, అడిషన్స్ ఇచ్చేవాళ్లమని ఆమె అన్నారు.
నేను ఎదుర్కొన్న ఇబ్బందులు చాలా తక్కువేనని రూపా లక్ష్మి వెల్లడించారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలకు కూడా అంగీకరించానని ఆమె చెప్పుకొచ్చారు.
"""/"/ మంచి ప్రాజెక్ట్ వచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయని ఆమె తెలిపారు.
ఒక సినిమా సెట్ కు వెళ్లిన తర్వాత వద్దని చెప్పడంతో నాకు బాధగా అనిపించిందని ఆ విధంగా ఇండస్ట్రీలో అవమానాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు నాకు అలాంటి భావన లేదని రూపా లక్ష్మి వెల్లడించారు.ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు అవుతోందని అమె చెప్పుకొచ్చారు.
పెద్దపెద్ద ఆర్టిస్ట్ లతో పని చేస్తున్న సమయంలో చాలా ఆనందంగా అనిపించిందని రూపా లక్ష్మి పేర్కొన్నారు.
సృష్టి అనే నాటిక నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆమె పేర్కొన్నారు.రూపా లక్ష్మి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!