నటి రోహిణి కాళ్ళు పట్టుకున్న అక్కినేని.. కారణం ఇదే!
TeluguStop.com
సౌత్ ఇండియన్ సీనియర్ నటి రోహిణి( Actress Rohini ) గురించి తెలుగువాళ్ళకు తెలిసిందే.
స్వతహాగా డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత అయినటువంటి రోహిణి సినీరంగములో బాల్యనటిగా అడుగు పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించి మెప్పు పొందింది.
ఆ తర్వాత కొంతకాలము మలయాళంలో నటిగా జీవితాన్ని ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది.
రోహిణి సినీ నటుడు రఘువరన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మీకు తెలుసా? అయితే వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
రోహిణి స్వస్థలం అనకాపల్లి, విశాఖపట్నం.ఆమె తండ్రి రావునాయుడుకి స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండడంతో ఆమెని ప్రోత్సహించాడు.
ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు కాగా.తెలుగు టీవీ నటుడు బాలాజీ ఈమె సోదరుడే.
రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో చెన్నైకి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతూ.
రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు.అలా స్టూడియోలో ఆమెను చూసి యశోద కృష్ణ( Yashoda Krishna ) అనే సినిమాలో బాలనటిగా అవకాశమిచ్చారు.
తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే ఆమె సినీరంగంలో ప్రవేశించింది.
"""/" /
ఈ క్రమంలోనే ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో పనిచేసింది.ఇక ఆమె నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసారు కూడా.
ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు ఆమె అప్పట్లో డబ్బింగు చెప్పేదట.
రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం "స్త్రీ"లో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో సత్కరించింది.
"""/" /
ఇక ఆ సమయంలోనే ఆమె అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారితో జరిగిన ఓ తమాషా విషయాన్ని తాజాగా ఓ మీడియా సమావేశంలో పంచుకోవడం జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన "మహాకవి క్షేత్రయ్య" అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు సందర్భాన్ని బట్టి నటి రోహిణి కాలు పట్టుకొనే సీన్ ఒకటి ఉంటుంది.
ఆ సీన్ చేసేటప్పుడు అక్కినేని వారు ఆమెతో.నేను ఎంత పెద్ద నటుడినో తెలుసా? నాతో కాళ్ళు పట్టించుకుంటున్నావ్? అని చమత్కరించారట! ఐతే వాస్తవానికి అప్పటికే రోహిణికి అక్కినేని నాగేశ్వరరావు ఎవరో పెద్దగా తెలియదట! దాంతో నాకు నిజంగా ఆయన గురించి తెలియదు అనడంతో.
ఆయన బిగ్గరగా నవ్వేశారు అంటూ.అలనాటి జ్ఞాపకాన్ని చెప్పుకొచ్చింది!.