నన్ను ఆ విషయంలో మా తల్లిదండ్రులు నమ్మలేదు... రష్మిక వైరల్ కామెంట్స్

నటి రష్మిక మందనా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన ఈ భామ ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది.

ఛలో సినిమా పరవాలేదనిపించినా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతాగోవిందం సినిమాలో రష్మిక నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఆ తరువాత రష్మికకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.ఇక వరుస పెట్టి తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.

ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన రష్మిక ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇక రష్మిక టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే ఇక బాలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది.అయితే గుడ్ బై సినిమాలో అమితాబ్ బచ్చన్ కూతురిగా రష్మిక కనిపించనున్న విషయం తెలిసిందే.

అయితే అమితాబ్ బచ్చన్ కు మా తల్లిదండ్రులు పెద్ద అభిమానులని, అయితే నేను అమితాబ్ సరసన నటిస్తున్నానని చెబితే మా తలిదండ్రులు నమ్మలేదని రష్మిక తెలిపింది.

అమ్మాయిల అందాన్ని పెంచే పొద్దుతిరుగుడు.. ఎలా వాడాలంటే..?