ఆ హీరోయిన్ నా ఫ్రెండ్ .. ఒక్క మాటతో ఫ్యాన్స్ ని తన వైపుకు తిప్పుకున్న బిగ్ బాస్ ప్రేరణ!

బిగ్ బాస్ ( Bigg Boss) తెలుగు సీజన్ 8 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలోకి 14 మంది కంటెస్టెంట్లు మొదటి రోజు ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిలో కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ( Prerana )!కూడా ఉన్నారు.

ఇక ప్రేరణ బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన అనంతరం నాగార్జున ( Nagarjuna ) గారితో  ఎంతో సరదాగా మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటపెట్టారు.

అంతేకాకుండా ఇండస్ట్రీలో నీకు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నారా అంటూ నాగార్జున ఈమెను ప్రశ్నించారు.

"""/" / ఈ ప్రశ్నకు ప్రేరణ సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ అంటే నటీ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) అంటూ ఈమె రష్మికతో తనకున్న అనుబంధం గురించి బయటపెట్టారు.

ఇలా రష్మిక మందన తనకు మంచి స్నేహితురాలని చెప్పడంతో నాగార్జున కూడా షాక్ అయ్యారు దీంతో రష్మిక అభిమానుల మనసు ప్రేరణ కొట్టేసిందని చెప్పాలి.

ఇలా ఒక్క మాటతో రష్మిక ఫ్యాన్స్ అందరిని కూడా తన వైపుకు తిప్పుకున్నారు.

దీంతో ఈమెకు హౌస్ లో ఉన్న సమయంలో రష్మిక అభిమానుల సపోర్ట్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.

"""/" / ఇక ప్రేరణ కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈమె కూడా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ప్రేరణ ఎలా తన పర్ఫామెన్స్ చూపించబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈమె హౌస్ లోకి అడుగుపెట్టగానే నాగార్జున ఒక టాస్క్ ఇవ్వగా అందులో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా తనకు చిన్నప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉంది అంటూ ఎవరికి తెలియని సీక్రెట్ కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)