నటి రమ్యకృష్ణ ఒక్కరోజు సంపాదన ఎంతంటే?

రమ్యకృష్ణ పాత తరం యువతకు ఓ స్వప్న సుందరి అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.

అప్పుడు ఉన్న ప్రతి ఒక్క టాప్ హీరోతో ఆడిపాడిన రమ్యకృష్ణ అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందని చెప్పవచ్చు.

తరువాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించిన సినిమాలతో గ్లామరస్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది.

అయితే నీలంబరి పాత్ర ఎంతగా రమ్యకృష్ణకు మంచి పేరు తీసుకొచ్చిందో, అలాగే బాహుబలి సిమిమాలో అద్భుత నటనతో శివగామి పాత్రలో లీనమై చేసిన నటనకు రమ్యకృష్ణ ఖ్యాతి ఖండాం తరాలు పాకింది.

ఇక బాహుబలి సినిమా హిట్ తో అందులో నటించిన ప్రముఖ నటుల ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.

అయితే నటుల పేరు ప్రఖ్యాతలు ఎలాగైతే గొప్పగా మారాయో, అలాగే రెమ్యునరేషన్ లు కూడా భారీగా పెంచేశారు.

అయితే శివగామి రమ్యకృష్ణ గురించి సినీ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.

రమ్యకృష్ణ రెమ్యునరేషన్ కు సంబంధించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు.అయితే ప్రస్తుతం రమ్యకృష్ణ రోజుకు 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందట.

సినిమా కాల్షీట్స్ ను బట్టి ఉదాహరణకు 10 రోజులంటే కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకుంటుంది.

కుర్ర హీరోయిన్స్ ను మించి ఇంత పారితోషికం తీసుకుంటున్నదంటే రమ్యకృష్ణ క్రేజ్ ఎంతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఏది ఏమైనా ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?