మంత్రి రోజాకు మద్దతుగా వీడియో విడుదల చేసిన నటి రమ్యకృష్ణ..!!
TeluguStop.com
కొద్ది రోజుల క్రితం వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ విమర్శలు చేయడం తెలిసిందే.
రోజా నీలి చిత్రాలలో నటించిందని వాటికి సంబంధించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని.
హెచ్చరిస్తూ మాట్లాడారు.బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కలకలం రేపాయి.
ఈ క్రమంలో ఆయనపై కేసు కూడా నమోదు అయింది.గుంటూరు పోలీసుల అరెస్టు చేయగా.
తర్వాత బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసారు.ఇదిలా ఉంటే మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను.
చాలామంది సీనియర్ హీరోయిన్స్ ఖండిస్తూ ఉన్నారు.ఇప్పటికే కుష్బూ, రాధిక, నవనీత్ కౌర్ తమ మద్దతు తెలిపి వీడియోలు విడుదల చేశారు.
"""/" /
తాజాగా ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా రోజాకి మద్దతు తెలుపుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
రోజాను అసభ్యకరంగా దూషించటం దారుణమని అన్నారు.మనదేశంలో మాత్రమే భారత మాతాకీ జై అని అంటాము.
అలాంటి దేశంలో మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అని నిలదీశారు.ఇప్పటికీ దేశంలో మహిళలపై బహిరంగంగా దూషణలు కొనసాగటం బాధాకరమని స్పష్టం చేశారు.
బండారు సత్యనారాయణ రోజాపై చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివి అని నటి రమ్యకృష్ణ వీడియోలో స్పష్టం చేశారు.
ఈ సముద్రంలో మూత్రం పోస్తే 67 వేల ఫైన్ కట్టాల్సిందే.. ఎక్కడంటే..