యంగ్ హీరోయిన్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రమ్యకృష్ణ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి రమ్యకృష్ణ( Ramyakrishna )గురించి చెప్పాల్సిన పనిలేదు.

హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె యాంకర్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురయింది.

"""/" / ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్లకు( Young Heroins )మీకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి.

ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు హీరోయిన్లుగా కొనసాగలేకపోతున్నారు అందుకు కారణం ఏంటి అనే ప్రశ్న రమ్యకృష్ణకు ఎదురైంది.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.ఒకప్పుడు మాకు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి సమయం ఉండేది కానీ ఇప్పుడు హీరోయిన్లకు అంత సమయం లేదని రమ్యకృష్ణ తెలిపారు.

చాలామంది అమ్మాయిలు సినిమాలలో నటించాలన్న ఫ్యాషన్ తో ఎంతో తొందరగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు అయితే అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు.

"""/" / ఇక మేము గత కొన్ని సంవత్సరాలుగా సంపాదించినటువంటి డబ్బును ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ చాలా తక్కువ సమయంలోనే సంపాదించుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు.

టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో తెలియదు.దాన్ని బట్టి మనం కూడా మారాల్సి ఉంటుంది.

మన జీవితంలో ఏది స్థిరంగా ఉండదు.దానిని మనం గ్రహించి ఉన్న దానితోనే సర్దుకుపోవడం ఎంతో మంచిదని తెలిపారు.

ఇలా అప్పట్లో తమకు ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోయిన్లకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి ఈ సందర్భంగా రమ్యకృష్ణ ( Ramyakrishna )మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పవన్ కు దగ్గరవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్న అలీ.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా?