ఇల్లు అమ్మకానికి పెట్టిన రాగిణి ద్వివేదీ.. ఆ భయంతోనేనా?
TeluguStop.com
ప్రస్తుతం కన్నడ చిత్రపరిశ్రమ లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో పాటు ఇతరితరులు కూడా అరెస్ట్ అయ్యారు.
ముఖ్యంగా నటి రాగిణి ద్వివేది ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే యూరిన్‌లో నీళ్లు కలిపి అడ్డంగా దొరికిపోయిన రాగిణిని.బెంగుళూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజాగా రాగిణి ద్వివేదీ తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన యలహంకలోని అపార్ట్‌మెంట్‌ను మరియు ఇతర ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.
ఐటీ దాడులు, జప్తుల భయంతోనే రాగిణి ద్వివేదీ తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.
అయితే రాగిణి అమ్మకానికి పెట్టిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట.
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైల్‌లో ఉంటున్న రాగిణి ద్వివేదీ ఆస్తులు కొనుగోలు చేస్తే.
లేనిపోని చిక్కులు తెచ్చుకున్నట్టు అవుతుందనే భావనతో ఆమె ఆస్తులు కొనేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
దీంతో రాగిణి ద్వివేది ఐటీ శాఖను చూసి విపరీతంగా భయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కాగా, డ్రగ్స్ వ్యావహారంలో రెండు వారాల క్రితం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.
పలు ఆధారాలు దొరకడంతో రాగిణి ద్వివేదీని అరెస్ట్ చేశారు.ఇక రాగిణితో పాటు మరికొంత మంది నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో వారికి బెయిల్ దొరకటం కూడా కష్టమే అని తెలుస్తోంది.
మరోవైపు రాగిణి ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.ఇక మరో నటి సంజన గల్రానీని మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున.
ఆమె సీసీబీ కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు.దీంతో సంజనకు సీసీబీ కస్టడీని పొడిగించారు.
వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!