ఘనంగా నటి పూర్ణ కుమారుడి బారసాల వేడుక… వైరల్ అవుతున్న ఫోటోలు!
TeluguStop.com
శ్రీమహాలక్ష్మి సినిమా ద్వారా వెండితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి పూర్ణ( Poorna ) .
అనంతరం ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూర్ణ అనంతరం సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అదేవిధంగా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.
ఈ విధంగా బుల్లితెరపై వెండితెరపై ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఈమె గత ఏడాది ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఇలా వీరి వివాహం జరిగి ఏడాది పూర్తిగా కాకుండానే పూర్ణ ఏప్రిల్ నాలుగో తేదీ పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.
పెళ్లయిన తర్వాత పూర్ణ పెళ్లికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.అదేవిధంగా తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను, తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.
అయితే ఏప్రిల్ 4వ తేదీ నటి పూర్ణకు మగ బిడ్డ జన్మించారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు.
"""/" /
ఇలా ఏప్రిల్ నాల్గవ తేదీ మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పటివరకు తన కొడుకు ఫేస్ మాత్రం బయట పెట్టలేదు.
అయితే తాజాగా మదర్స్ డే ( Mother's Day ) సందర్భంగా ఈమె తన కుమారుడు భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా షేర్ చేశారు.
అలాగే తన కుమారుడి బారసాల కూడా జరగడంతో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం పూర్ణ కుమారుడి బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక పూర్ణ కుమారుడి పేరు కూడా ఈ సందర్భంగా రివీల్ చేశారు.ఇక పూర్ణ కుమారుడి పేరు ఏంటి అనే విషయానికి వస్తే.
హందన్ ఆసిఫ్ అలీ ( Hamdan Asifali ) అని నామకరణం చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ