విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ప్రియమణి.. సంతోషంలో అభిమానులు?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తున్నారు.
ఇకపోతే ప్రియమణి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈమె తన భర్త ముస్తఫా రాజ్ తో విడాకుల తీసుకుపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా తన విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి మాత్రం స్పందించకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావించారు.
ఇకపోతే ప్రియమణి భర్త అమెరికాలో ఉంటున్నారు ఈమె ఇండియాలో ఉంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా ఈ మధ్యకాలంలో ఈమె షేర్ చేయకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావించారు.
అయితే తాజాగా ప్రియమణి దీపావళి పండుగ సందర్భంగా తన విడాకుల గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/10/actress-priyamani-clarity-on-orce-with-husband-mustafa-raj-detailss!--jpg "/
ఇలా ఈమె దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆ పోస్టు కింద మిస్ యు ముస్తఫా అంటూ కోట్ చేసి లవ్ సింబల్ తో పోస్ట్ షేర్ చేశారు.
ఈ విధంగా తన భర్త పేరును ప్రస్తావిస్తూ ఈమె తనని ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పడంతో విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.
ఈ క్రమంలోనే ఈమె విడాకుల వార్తల గురించి పరోక్షంగా స్పందించడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియమణి ప్రస్తుతం సినిమాలలోను మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.
వరుణ్ తేజ్ మట్కా తొలిరోజు కలెక్షన్ల లెక్క ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!