సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రణీత.. పెళ్లికొడుకు ఎవరంటే..?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన ప్రణీత సుభాష్ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.
తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన ప్రణీత సుభాష్ కరోనా బాధితులకు, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేసి వార్తల్లో నిలిచారు.
అయితే ఈ బ్యూటీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.నితిన్ రాజు అనే ప్రముఖ వ్యాపారవేత్తను ప్రణీత వివాహం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా ప్రణీత పెళ్లి వస్త్రాల్లో దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఆమె సన్నిహితులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం శుక్రవారం రోజున ప్రణీత వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
నితిన్ రాజు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోను షేర్ చేయగా ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది.
తెలుగులో ప్రణీత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించారు. """/"/
కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రణీత మ్యారేజ్ నిరాడంబరంగా జరిగిందని అతి తక్కువమంది ఈ వివాహ వేడుకకు హాజరయ్యారని సమాచారం.
అయితే ఈ పెళ్లి ఫోటోల గురించి, పెళ్లి గురించి ప్రణీత స్పందిస్తే మాత్రమే వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రణీత నితిన్ రాజు మ్యారేజ్ లవ్ మ్యారేజా.? లేక అరేంజ్డ్ మ్యారేజా ? అనే చర్చ కూడా అభిమానుల మధ్య జరుగుతుండటం గమనార్హం.
"""/"/
గత కొన్ని రోజులుగా ప్రణీత పెళ్లికి సంబంధించి వార్తలు వస్తుండగా ఆ వార్తలు నిజం కావడం గమనార్హం.
గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగా ఈ ఏడాది ప్రణీత పెళ్లి చేసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రణీత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలు హిట్టైతే ప్రణీత బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉంది.