స్టార్ హీరోయిన్ ప్రణీత కూతురు లేటెస్ట్ పిక్స్ చూశారా.. చిన్నారి మరీ క్యూట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత( Pranitha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది.

మొదట బావ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దొచేసింది.

కానీ ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు.అలా తెలుగు తమిళంలో కొన్ని సినిమాలలో నటించింది.

"""/" / కెరీర్ మంచి బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును( Nithin Raju ) వివాహం చేసుకుంది.

వీరికి ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే.కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢీ షోకి జెడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్త కూతురికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

"""/" / పెళ్లి అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా గ్లామర్ ఫోటో రూట్లో పద్ధతిగా ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది ప్రణీత.

కాగా పెళ్లి అయినా కూడా ఈమె అందం ఏ మాత్రం తగ్గడం లేదు.

అమ్మగా ప్రమోషన్ పొందినా కూడా ఇప్పటి కుర్రహీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే రేంజ్ లో గ్లామర్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన కూతురితో( Pranitha Daughter ) కలిసి ఫోటో షూట్ చేసింది ప్రణీత.

ఆకుపచ్చ పట్టుచీరలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది.ప్రణీత పక్కనే ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రణీత కూతురు కనిపిస్తోంది.

పెద్ద కళ్లతో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది ప్రణీత కూతురు.కాగా ప్రణీత గ్రీన్ కలర్ పట్టు శారీలో నగలు దిగేసి కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రణీత కూతురి ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అచ్చం ప్రణీతలనే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?