నా పతనానికి కారణం అదే: యాక్ట్రెస్ ప్రగతి

సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటారు, హీరోయిన్స్ కెరీర్స్ మాత్రం చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది ఎందుకంటే వాళ్లు తొందరగా పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ నీ ఏర్పరుచుకుంటారు తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు అందుకే వల్ల కెరీర్ అనేది ఇక్కడ చాలా తక్కువ టైం ఉంటుంది అందుకే చాలామంది ముందుగా హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత తల్లి పాత్రలు చేస్తూ ఉంటారు.

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చలామణి అయిన వారు సైతం ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తున్నారు అందుకు ఉదాహరణగా రమ్యకృష్ణ గారిని తీసుకోవచ్చు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో రానా ప్రభాస్ కు తల్లిగా రమ్యకృష్ణ నటించి మంచి గుర్తింపు సంపాదించారు.

హీరోయిన్ గానే కాదు ఏ పాత్ర ఇచ్చిన తను ఆ పాత్రకు న్యాయం చేయగలరు అని నిరూపించారు.

రమ్య కృష్ణ చేసిన శివగామి పాత్ర తో ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారు.

రమ్యకృష్ణ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా తో విజయశాంతి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు.

వీళ్లే కాకుండా ఇప్పుడున్న చాలామంది తల్లి పాత్రలు చేసే వాళ్లు ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన వాళ్లే హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోలకి తల్లి పాత్రలు పోషిస్తున్నారు అలాంటి వాళ్లలో ప్రగతి ఒకరు ప్రగతి పెద్దగా చదువుకోలేదు.

సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమిళంలో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు దాంతో చేసేదిలేక పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనుకోని పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది తర్వాత ఏం చేయాలో తెలియక తను చదువుకున్న చదువుకి బయట జాబ్ దొరకదు అనుకొని ఎలాగైనా మనం ఇండస్ట్రీలోనే రాణించాలి అనుకొని మళ్ళీ తల్లి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చింది.

ప్రస్తుతం ఆమె వాళ్ళ భర్త నుంచి దూరంగా ఉంటున్నారు సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రగతి కి మంచి గుర్తింపు వచ్చింది ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరికీ తల్లిగా చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది ఆమె నటించిన సినిమాలు బాద్షా, ఏమైంది ఈ వేళ, జులాయి, గంగోత్రి, కేరింత, దూకుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

ప్రస్తుతం ఉన్న హీరోలందరికీ తల్లి పాత్ర చేయాలంటే ప్రగతి గారే బెస్ట్ ఆప్షన్ అనేంతగా తన మార్క్ చూపించారు.

అయితే ఈమధ్య లాక్ డౌన్ లో ప్రగతి జిమ్ చేస్తున్నా వీడియోలు, అలాగే డాన్స్ వీడియోలు నెట్ లో పెట్టి తన ఫ్యాన్స్ తో పాటు జనాలు అందరిని అలరించారు.

అయితే ప్రగతి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు సాధించారు కానీ నిజ జీవితంలో లో ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్న చనిపోతే టెలిఫోన్ బూత్ లో పనిచేస్తూ వాళ్ళ అమ్మకి చేదోడు వాదోడుగా ఉన్నారు.

"""/"/ దూకుడు సినిమా లో సమంతకు తల్లిగా నటించి హీరోయిన్ వాళ్ళ మదర్ అంటే ఇలా ఉండాలి అని తన నటన తో చేసి మెప్పించారు అలాగే ఏమైంది ఈవేళ సినిమాలో హీరో వాళ్ళ అమ్మ గా చేసి మంచి గుర్తింపు సాధించారు.

జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ భార్య గా చేశారు.ప్రగతి ఇప్పటికీ కూడా చాలా మంది హీరోయిన్స్ కంటే కూడా చాలా బాగుంటారు అయితే ఆమె అందానికి సీక్రెట్ ఏంటి అని అడిగితే ఎప్పుడు నవ్వుతూ ఉండటంతో పాటు రోజు జిమ్ చేయడమే అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తను చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా తన లైఫ్ ని గడుపుతున్నారు.

అయితే సినిమాల్లో నటించినప్పుడు చాలా హ్యాపీ గా ఉంటుందని బ్రేక్ టైం లో యాక్టర్స్ అందరి తో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంటానని ఎవరిమీద కోపం లేకుండా మరియు ఎప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా ఉంటానని చెప్పారు.

పెళ్లికూతురు చీరలో శోభిత.. చైతన్య శోభిత కలకాలం సంతోషంగా ఉండాలంటూ?