రెండో పెళ్లిపై స్పందించిన ప్రగతి.. నాతో కొంచెం కష్టమే అంటూ వైరల్ కామెంట్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రగతి.

తెలుగులో ఎక్కువగా హీరో హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది.ఇకపోతే ప్రస్తుతం ప్రగతి అడపాదడపా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది.

కరోనా మహమ్మారి తర్వాత ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పవచ్చు.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మరీ ముఖ్యంగా ఆమె తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

తరచూ జిమ్ లో కసరత్తులు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ వయసులో కూడా ప్రగతి ఆ రేంజ్ లో కసరత్తులు చేయడం చూసి చాలామంది ఆయన ప్రశంసించగా ఇంకొందరు మాత్రం నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేశారు.

అంతేకాకుండా ఆమె ఈ వయసులో కూడా ఎంతో బాగా ఎంతో ఎనర్జిటిక్ గా డాన్సులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రగతి రెండో పెళ్లి పై ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఆమె ఆ వార్తలు వినిపించిన ప్రతిసారి కూడా ఘాటుగా స్పందిస్తూ వచ్చింది. """/"/ ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతిని యాంకర్ రెండో పెళ్లి చేసుకోవాలని అనిపించిందా అని ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన ప్రగతి.

పెళ్లి అనడం కంటే దానిని కంపానియన్ అంటే బెటర్.చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని తెలిపింది ప్రగతి.

కంపానియన్ బాగుంటుందని అనిపించినా మళ్లీ నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.

అదికాక సింగిల్ పర్సన్ దొరకడం అంతే కష్టం.కానీ రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుందని నేను నమ్ముతుంటాను అని తెలిపింది ప్రగతి.

అయినా కూడా నాతో కొంచెం కష్టం.ఎందుకంటే నాకంటూ కొన్ని విషయాల్లో పర్టికులర్ గా ఉంటాను.

నాకు ఇలాగే కావాలి అలాగే ఉండాలి అని చెప్పుకొచ్చింది ప్రగతి.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!