తల్లి పాత్రలో నటించాలని అడగగానే బోరున ఏడ్చేసిన ప్రగతి.. కారణం ఏంటంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది ప్రగతి.
ఈమె ఎక్కువగా హీరో హీరోయిన్ లకు తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది.అలా ఎన్నో సినిమాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి.
ఇకపోతే నటి ప్రగతికి తెలుగులో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.
ప్రగతి సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వర్కౌట్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.
అప్పుడప్పుడు తనపై సెటైర్స్ వేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ప్రగతి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రగతి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది.
సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రమోహన్ గారి ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది ఆయన భార్యను నేను ఆంటీ అని పిలిచే దానిని.
అటువంటిది నేను ఆయనకు భార్య నటించాల్సి వచ్చింది అని తెలిపింది ప్రగతి. """/"/ అయితే ప్రగతి తెరపై మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆమె వయసు 24 మాత్రమే నట.
అప్పటికే ప్రగతి హీరోయిన్గా చేస్తుందని.ఆ వయసులోనే హీరోయిన్స్ కి తల్లిగా అవకాశం వచ్చినప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందట.
ఆరోజు సెట్స్ లోకి వెళ్ళగా ఆమెను చూసి ఈవిడ ఏంటి జడ వేసుకొని వచ్చింది వెళ్లి ముడి వేసుకుని రమ్మని చెప్పండి అని చెప్పినప్పుడు ఆమె మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చిందట.
ఆ తర్వాత ఆమె నిదానంగా మదర్ పాత్రను గౌరవించడం మొదలుపెట్టిందట.ఒక అప్పటినుంచి ఆమె అవకాశాల కోసం ఎవరిని అడగలేదని అవకాశాల కోసం ఎదురు చూడలేదు అని చెప్పుకొచ్చింది ప్రగతి.
అంతే కాకుండా ప్రగతి ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట.
వాడికోసమే వైన్ షాప్ కు వెళ్లాను… అసలు విషయం చెప్పిన బన్నీ!