ఆ సినిమాల్లో నటించలేదనే బాధ ఇప్పటికీ ఉందంటున్న సీనియర్ నటి..

ప్రభ.అనాటి అందాల తార.

ఎన్నో అద్భుత సినిమాలతో జనాలకు దగ్గరైన నటీమణి.70వ దశకంలో జయప్రద, జయసుధతో పాటు ప్రభ కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

దాదాపు 5 దశాబ్దాలుగా ఈమె సినీ ప్రయాణం కొనసాగుతుంది.ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది.

కొన్ని గొప్ప సినిమాల్లో నటించే అవకాశం ఉన్నా వదులుకున్నందుకు బాధపడుతుంది.వాస్తవానికి ప్రభ.

సావిత్రి వీరాభిమాని.విజయలక్ష్మి అంటే కూడా చాలా ఇష్టం.

వీరిని చూసే తాను సినిమాల్లోకి రావాలి అనుకున్నట్లు చెప్పింది.తనకు కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్లు చెప్పింది.

నీడలేని ఆడది సినిమాలో హీరోయిన్ గా తొలి సినిమా చేసింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

దీంతో నవశక్తి ఫిలిమ్స్‌ సంస్థ తనతో మూడేళ్ల పాటు అగ్రిమెంట్ తీసుకున్నారు.అప్పుడు తను టీనేజీలో ఉంది.

ఆ తర్వాత పద్మాలయ వాళ్లు అడిగారు.శోభన్ బాబు సరసన హీరోయిన్ గా చేసేందుకు.

అయితే కథ నచ్చితేనే చేస్తాను అని చెప్పింది.కథ మీకెలా చెప్తాం అనడంతో అవకాశం పోయింది.

అగ్రిమెంట్ ఉన్నప్పుడు వారికి నచ్చిన సినిమాలే చేయాలనేది వారి పట్టుదల.కానీ తను భయటకు రాలేకపోయింది.

18 సంత్సరాలు నిండాక ఎంఎస్‌ రెడ్డి, బాలయ్య సినిమాలకు ఓకే చెప్పాను.ఆమెతో అగ్రిమెంట్ తెచ్చుకున్న నిర్మాత ఇంజెక్షన్ ఆర్టర్ తెచ్చాడు.

తనకు 18 ఏండ్లు నిండాయని.ఆ సినిమాలు తప్పకుండా చేస్తాని గట్టిగా చెప్పింది ప్రభాకర్‌రెడ్డి, నాగభూషణం, మరికొందరు పెద్దలు.

చిన్న పిల్లమీద కేసులు వద్దని సదరు నిర్మాతకు చెప్పారు.ఆ తర్వాత తనకు మంచి అవకాశాలు వచ్చాయి.

రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, కమల్‌హాసన్‌ తో కలిసి నటించే అవకాశం వచ్చింది.

మంచి పాత్రలకు గాను మంచి అవార్డులు కూడా వచ్చాయి. """/" / అటు మధ్య మధ్యలో కొన్ని హిట్ సినిమాలు చేసే అవకాశం వచ్చినా.

వినియోగించుకోలేదు ప్రభ.వాటిలో చిరంజీవి సినిమా ఖైదీ ఒకటి.

డేట్స్ కుదరక ఈ సినిమా చేయలేకపోయింది.శోభన్ బాబుతో ఈమె కలిసి నటించలేదు.

దోషి నిర్దోషి సినిమాలో తనతో కలిసి నటించే అవకాశం వచ్చినా.అప్పుడు తను తానా ఉత్సవాల్లో ఉండటం మూలంగా సినిమా చేయలేదు.

ప్రస్తుతం మా టీవీలో సీరియల్స్ చేస్తున్నట్లు వెల్లడించింది.

టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ?